AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrutha: అమృత మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఆ ఫేమస్ హీరోయిన్ కూతురా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? లేటెస్ట్ ఫొటోస్

లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సినిమాల్లో అమృత ఒకటి. 2002లో విడుదలైన ఈ సినిమాలో మాధవన్, సిమ్రాన్ జంటగా నటించారు. ఇక వీరి కూతురు అమృత పాత్రలో ఒక చైల్డ్ ఆర్టిస్టు అద్భుతంగా నటించింది.

Amrutha: అమృత మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఆ ఫేమస్ హీరోయిన్ కూతురా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? లేటెస్ట్ ఫొటోస్
Amrutha Movie Child Artist
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2024 | 5:48 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని ఏలేస్తోన్న హీరో, హీరోయిన్లలో చాలా మంది గతంలో ఛైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారే. చిన్నతనంలోనే తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న వారే. అయితే గతంలో బాల నటులుగా అలరించిన చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉండిపోయారు. అలాంటివారిలో కీర్తన ఒకరు. పేరు చెబితే గుర్తుకు పట్టకపోవచ్చు కానీ అమృతా మూవీ చైల్డ్ ఆర్టిస్టు అంటే మాత్రం ఠక్కున మన కళ్ల ముందు మెదులుతుంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో అమృతా కూడా ఒకటి. 2002లో విడుదలైన ఈ ఫీల్ గుడ్ సినిమాలో మాధవన్, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఇదే సినిమాలో తన క్యూట్ యాక్టింగ్ తో ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది బేబి పీఎస్ కీర్తన. ఆ అమ్మాయి మరెవరో కాదు.. కోలీవుడ్ ప్రముఖ నటుడు కమ్ డైరెక్టర్ పార్తీబన్, నటి సీతల కుమార్తె. ముఖ్యంగా సీతకు టాలీవుడ్ తో మంచి అనుబంధం ఉంది. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె ఆ తర్వాత సహాయక నటిగా స్థిర పడిపోయింది. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలకు అమ్మగా, వదినగా నటించింది.

ఒక్క సినిమాతోనే సరి..

ఇక కీర్తన విషయనికి వస్తే.. పేరెంట్స్ ఇద్దరూ ప్రముఖ నటుటు కావడంతో తాను కూడా చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన క్యూట్ యాక్టింగ్ తో ఆడియెన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన అమృత చుట్టే కథంతా తిరుగుతుంది. మొదటి సినిమాతోనే అవార్డులు, ప్రశంసలు అందుకున్న కీర్తన తల్లిదండ్రుల్లాగానే నటిగా స్థిరపడిపోతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. అమృత సినిమానే కీర్తనకు ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అయిపోయింది.

కుటుంబ సభ్యులతో కీర్తన..

Amrutha Movie Artist

Amrutha Movie Artist

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ డైరెక్టర్ కు భార్యగా..

అప్పట్లో చదువు దృష్ట్యా సినిమాలకు దూరమైన కీర్తన ఇప్పుడు ఒక ఇంటి ఇల్లాలు కూడా అయ్యింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని ఏ శ్రీకర్ ప్రసాద్ కొడుకు ప్రముఖ దర్శకుడు అక్కినేని అక్షయ్‌ను కీర్తన వివాహం చేసుకుంది. భర్త అక్షయ్ హిందీలో దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఇక కీర్తన ప్రస్తుతం తన సమయాన్ని పూర్తిగా తన ఫ్యామిలీకే కేటాయించింది.

కీర్తన పెళ్లిలో కమల్ హాసన్

Keerthana

Keerthana

మరిన్ని సినిమా వార్తల , కథనాల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి