Kannappa: కన్నప్ప సినిమా కోసం మోహన్ లాల్ పారితోషికం ఎంతంటే..
మోస్ట్ అవైటెడ్ సినిమా కన్నప్ప. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ సినిమా కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరింత ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్నారు.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న సినిమా కన్నప్ప. భారీ బడ్జెట్ తో డైలాగ్ కింగ్ మోహన్ బాబు సొంత బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో తెలుగుతోపాటు హిందీ, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సీనియర్ నటీనటులు భాగమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ముఖ్య పాత్రల పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. సుమారు రూ.140 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలిపారు.
ఈ మూవీలో శివుడి పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కనిపించనున్నారని.. ఆ పాత్ర కోసం ఆయనను సంప్రదించినప్పుడు రెండు సార్లు రిజెక్ట్ చేశారని.. ఆ తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి మరీ ఆయనను ఒప్పించామని అన్నారు. శివుడి పాత్రకు అక్షయ్ వందశాతం న్యాయం చేశారని.. ఈ తరానికి మీరే శివుడు అని అక్షయ్ తో చెప్పానని అన్నారు మంచు విష్ణు. “ఈ సినిమా ప్రభాస్, మోహన్ లాల్ సైతం కీలకపాత్రలు పోషిస్తున్నారు. కథ చెప్పగానే ఇద్దరూ అంగీకరించారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడిగారు. ఈ సినిమా కోసం వాళ్లిద్దరు ఒక్క రుపాయి పారితోషికం తీసుకోలేదు. మహోన్ బాబు మీద ఉన్న అభిమానంతో ఇందులో నటించారు. మోహన్ లాల్ దగ్గరకు వెళ్లినప్పుడు పారితోషికం కోసం మీ మేనేజర్ తో మాట్లాడమంటారా అని అడిగితే ఆయన పెద్దగా నవ్వారు. నువ్వు అంత పెద్ద వాడివి అయ్యావా అని అడిగారు.. ఇక ప్రభాస్ వల్ల నాకు స్నేహం పై మరింత అభిమానం పెరిగింది” అంటూ చెప్పుకొచ్చారు మంచు విష్ణు.
మహాభారత సిరీస్ రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో విష్ణు కూతుర్లు, కుమారు అవ్రామ్ సైతం బాలనటీనటులుగా తెరంగేట్రం చేస్తున్నారు. ఇక రుద్ర పాత్రలో ప్రభాస్, పార్వతి పాత్రలో కాజల్ నటిస్తుంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన








