Megastar Chiranjeevi: అన్నయ్య క్రేజ్ అంటే ఇట్లుంటది మరీ.. సినిమా తీసింది 29 రోజులు.. ఆడింది 500 రోజులు..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Feb 04, 2023 | 2:06 PM

కేవలం నెల రోజులు కూడా తియ్యని మూవీ.. దాదాపు 500 రోజులు హౌస్ ఫుల్ బోర్డుతో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. చిరంజీవి కెరీర్లోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.

Megastar Chiranjeevi: అన్నయ్య క్రేజ్ అంటే ఇట్లుంటది మరీ.. సినిమా తీసింది 29 రోజులు.. ఆడింది 500 రోజులు..
Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు స్పూర్తి. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. స్వయం కృషితో మెగాస్టార్ అయ్యారు. చిరు సినిమా వచ్చిందంటే థియేటర్లలో రచ్చ జరిగేది. అన్నయ్య సినిమాకు కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. మాస్.. యాక్షన్ చిత్రాలే కాదు.. కామెడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ చిరు స్టైల్ ప్రత్యేకం. అలాగే ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు చిరు. అయితే ఆయన కెరీర్ ఆరంభంలో తెరకెక్కించిన ఓ సినిమా అప్పట్లే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం నెల రోజులు కూడా తియ్యని మూవీ.. దాదాపు 500 రోజులు హౌస్ ఫుల్ బోర్డుతో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. చిరంజీవి కెరీర్లోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా. అదే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.

1982లో మెగాస్టార్ చిరంజీవి.. మాధవి జంటగా నటించిన చిత్రం ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ పై కే. రాఘవ నిర్మించారు. దర్శకుడిగా కోడి రామకృష్ణను.. నటుడిగా గొల్లపూడి మారుతీ రావు లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా ఇది. 1982 ఏప్రిల్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఏకంగా 512 రోజులు ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చిరు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఇందులో చిరు ఇమేజ్ కొత్తగా చూపించడమే కాకుండా.. కేవలం 29 రోజులలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. యావరేజ్ టాక్ తో జర్నీ స్టార్ట్ చేసింది. కానీ మెల్లగా కలెక్షన్స్ వర్షం కురిపించింది. కేవలం 3 లక్షల 25 వేల రూపాయాలతో పాలకొల్లు, నరసాపురం, సఖినేటి పల్లి, పోడూరు, భీమవరం, మద్రాసు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారట. అయితే సెన్సార్ సమయంలో రపలు ఇబ్బందులు కూడా ఎదురయ్యాయట. ఆ తర్వాత విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఎనిమిది కేంద్రాలలో 50 రోజులు.. రెండు కేంద్రాలలో వందరోజులు ఆడి భారీగా వసూళ్లు రాబట్టింది. అలాగే హైదరాబాద్ నగరంలో ఏకంగా 512 రోజులు అడిందంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాదు.. చిరుకు.. దర్శకుడిగా కోడి రామకృష్ణకు ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu