Vani Jayaram: ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూత.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ
సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కళాతపస్వి కె. విశ్వనాథ్ హఠాన్మరణం నుంచి ఇంకా కోలుకోకముందే సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ వాణీ జయరామ్(78) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు.
సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కళాతపస్వి కె. విశ్వనాథ్ హఠాన్మరణం నుంచి ఇంకా కోలుకోకముందే సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ వాణీ జయరామ్(78) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తన గాన ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ గాయనికి పద్మభూషణ్ అవార్డు పురస్కారం ప్రకటించింది. ఇంతలోనే ఆమె కన్నుమూయడం సినీ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. పలువురు ప్రముఖులు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. తమిళనాడులోని వేలూరులో పుట్టిన వాణీ జయరాం తెలుగు, తమిళం సహా పలు భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. 1000 సినిమాలకు పైగా ప్లే బ్యాక్ సింగర్ గా వ్యవహరించారు. ముఖ్యంగా భక్తిగీతాలకు ఆమె పెట్టింది పేరు. ఇలా సుమారు 19 భాషాల్లో తన సుమధుర గానంతో అలరించిన ఈ గానకోకికలకు ఇటీవలే పద్మభూషణ్ పురస్కారం వరించింది. అయితే ఈ అవార్డు అందుకోకుండానే ఈ లోకాన్ని విడిచిపోయారు. వాణీ జయరాం స్వస్థలం తమిళనాడులోని వెల్లూరు. 1945 నవంబర్ 30న ఆమె జన్మించారు. 8వ ఏటనే ఆలిండియా రేడియోలో పాట పాడి అబ్బురపర్చిన బాల మేధావి వాణీ జయరాం. ఆ తర్వాత కర్నాటక, హిందుస్తానీ సంగీతం నేర్చుకుని.. నేపథ్య గాయనిగా మారారు. అయితే, వాణీ జయరాం సినీ ఎంట్రీ విచిత్రంగా జరిగింది. పెళ్లి తర్వాత ముంబైలో స్థిరపడ్డ వాణీ జయరాం.. అనుకోనివిధంగా సూపర్ హిట్ హిందీ మూవీ గుడ్డి ద్వారా సినీ సంగీత ప్రచంచంలోకి అడుగుపెట్టారు. బోలె రే పపీ హరా పాటతో నేపథ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేశారు వాణీ జయరాం.
20 వేలకు పైగా పాటలు..
వెయ్యికి పైగా సినిమాలు, 20వేలకు పైగా పాటలు, ఇదీ వాణీ జయరాం తిరుగులేని రికార్డు. కేవలం మూవీ సాంగ్సే కాదు, వేల సంఖ్యలో భక్తి గీతాలను ఆలపించారు వాణీ జయరాం. 1971లో తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మళయాలం, ఒరియా, హిందీతోపాటు మొత్తం 19 భాషల్లో పాటలు పాడిన ఘనత వాణీ జయరామ్‌ది. ఇక తెలుగులో మానస సంచరరే, దొరకునా ఇటువంటి సేవ, ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ, ఆనతినీయరా.. లాంటి మధురమైన పాటలతో తెలుగులో తన ముద్ర వేసుకున్నారు వాణీ జయరాం. తెలుగులో ఆమె పాడింది తక్కువ పాటలే అయినా, తెలుగు పాటలతోనే రెండుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు వాణి. తమిళ్ మూవీ అపూర్వ రాగంగళ్‌తో మొదటిసారి నేషనల్ అవార్డుకి ఎంపికైన వాణి, ఆ తర్వాత తెలుగు సినిమాలైన శంకరాభరణం, స్వాతికిరణంతో రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా నిలిచారు.
వాణీ జయరాం గాత్రం అప్పుడూఇప్పుడూఎప్పుడూ ఎవర్‌గ్రీనే. ఎందుకంటే, ఆమె గొంతులోనే ఏదో అద్భుతముంది, మైమరిపించే మాయ ఉంది. అందుకే, కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు వాణీ, ఇప్పుడు భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌ను సైతం తన వశం చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ పురస్కారాన్ని అందుకోకుండానే తుదిశ్వాస విడిచారు.
Terrible news coming in.. we have lost yet another gem.#VaniJayaram ji is no more amongst us. A voice that has enthralled us for many years has left us heartbroken. Her sweet and gentle nature was so evident in her voice. You will always be remembered amma. Om Shanti ??#RIP pic.twitter.com/mHU2XNuPWj
— KhushbuSundar (@khushsundar) February 4, 2023
Senior Singer #VaniJayaram passed away at her residence in Chennai today.
Om Shanti pic.twitter.com/ITKZswvcn6
— BA Raju’s Team (@baraju_SuperHit) February 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..