AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఇదేం సినిమా అని తిట్టారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.. కారణం ఆయనే..

దర్శకుడు వంశీ తన చిత్రం నిర్మాణం తర్వాత ఎదుర్కొన్న తీవ్ర ఒత్తిడిని, ఇళయరాజా సంగీతం ఆ సినిమాను, ఆ తర్వాత అన్వేషణను ఎలా నిలబెట్టిందో వివరించారు. ఇళయరాజా రీ-రికార్డింగ్ మాయాజాలంతో ఎడిద నాగేశ్వరరావు వంటి నిర్మాతలు సైతం ఆశ్చర్యపోయారు. వారి మధ్య బలమైన అనుబంధాన్ని, ఇళయరాజా పనితీరును వంశీ గుర్తుచేసుకున్నారు.

Cinema : ఇదేం సినిమా అని తిట్టారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.. కారణం ఆయనే..
Sitara
Rajitha Chanti
|

Updated on: May 04, 2026 | 12:28 PM

Share

దర్శకుడు వంశీ ఇళయరాజాతో తన సుదీర్ఘ అనుబంధాన్ని, ముఖ్యంగా తన చిత్రాలైన సితార, అన్వేషణ నిర్మాణ సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. సితార చిత్రంలో డైలాగులు తక్కువగా, సైలెన్స్ ఎక్కువగా ఉండేలా తాను సీన్లు కన్సీవ్ చేసుకున్నానని వంశీ తెలిపారు. మద్రాసులోని రామానాయుడు థియేటర్‌లో డబుల్ పాజిటివ్ ప్రొజెక్షన్ చూపించిన రాత్రి, ఎడిద నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, యూనిట్ సభ్యులు దాదాపు 100-150 మంది సినిమా చూశారు. ఎక్కడా డైలాగులు లేకపోవడం, కామెడీ లేకపోవడంతో అందరికీ విపరీతంగా బోర్ కొట్టింది. ఎడిద నాగేశ్వరరావు అయితే, శంకరాభరణం లాంటి కావ్యం తీసిన తాను ఈ కుర్రవాడికి సినిమా ఇచ్చి పెద్ద తప్పు చేశానని తీవ్రంగా భావించారు. ఈ సంఘటనతో తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యారు, నిద్రపట్టలేదని చెప్పుకొచ్చారు వంశీ. తరువాతి రోజు, రీ-రికార్డింగ్ కోసం ఇళయరాజా సితార చిత్రాన్ని చూశారు. సినిమా చూసిన తర్వాత ఇన్‌చార్జ్‌కు ప్రత్యేకంగా మూడు వీణలు, రెండు ఫ్లూట్లు, సరోద్, షహనాయ్ వంటి వాయిద్యాలు కావాలని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

ఇంటర్వెల్ సమయంలో “డైరెక్టర్ ఎక్కడ?” అని అడిగిన ఇళయరాజా, తనను తన పక్కన కూర్చోబెట్టుకున్నారని గుర్తుచేసుకున్నారు. మొత్తం సినిమా చూసిన తర్వాత, “ఇన్నాళ్లకు నేను అద్భుతంగా పనిచేయడానికి ఒక సినిమా దొరికింది నాకు, రేపటి నుంచి దీని పని చెప్తాను” అని చెప్పి వెళ్లిపోయారు. ఇళయరాజా మాటలతో ఎడిద నాగేశ్వరరావు ఆశ్చర్యపోయారు. తర్వాతి రోజు నుంచి, 70 ఎం.ఎం. థియేటర్‌లో స్క్రీన్‌పై చూస్తూ రీ-రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కో రీల్‌కు ఇళయరాజా సంగీతం అందిస్తుంటే సినిమా స్థాయి అద్భుతంగా పెరిగిందని వంశీ వివరించారు. సినిమా పూర్తయ్యాక, ఫైనల్ ప్రొడక్ట్‌ను కలిసి చూద్దాం అని ఇళయరాజా తనను ఎంతగా ఇష్టపడ్డారో వంశీ గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాతోనే వారి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..

సితార తర్వాత వంశీ దర్శకత్వం వహించిన అన్వేషణ సినిమాకు కూడా ఇళయరాజా నేపథ్య సంగీతం ఒక అద్భుతం అని వంశీ అన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 4 షిఫ్టుల్లో చేసినా, నేపథ్య సంగీతం పూర్తి కాలేదన్నారు. 8 షిఫ్టులు చేసినా టైటిల్స్ మిగిలిపోయాయని, అంత భారీ నేపథ్య సంగీతం అవసరమైందని వంశీ చెప్పారు. ఇళయరాజాకు తనపై ఉన్న అభిమానానికి నిదర్శనంగా, ఒకసారి రాయపేటలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సౌందరరాజన్‌తో జరిగిన సంభాషణను వంశీ పంచుకున్నారు. ఇళయరాజా తనను చూపిస్తూ, ఒక కుర్రాడు ఇంగ్లీష్ సినిమా లాగా తీసాడు అని చెప్పడం తనను ఎంతగానో సంతోషపరిచిందని వంశీ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..

Follow Us