పవన్‌కు ప్రియురాలిగా, రామ్ చరణ్‌కు తల్లిగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. 40 ప్లస్‌లోనూ..
ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలిందీ అందాల తార. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సూపర్ హిట్ సినిమాలు చేసిందీ ముద్దుగుమ్మ. పెళ్లి, పిల్లల తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు పవన్ కల్యాణ్. అనతికాలంలోనే పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. రాజకీయల్లో బిజీగా ఉండడంతో సినిమాలు తగ్గించినా ఇటీవలే ఓజీతో మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా తండ్రి, బాబాయిల అడుగు జాడల్లోనే నడిచాడు. వరుస విజయాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. కాగా ఈ బాబాయి, అబ్బాయిలతో కలిసి ఎంతో మంది హీరోయిన్లు నటించారు. కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్ ఇలా ఈ ఇద్దరు మెగా హీరోలతో నూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఒక సినిమాలో పవన్ కల్యాణ్ కు ప్రియురాలిగా, మరో సినిమాలో రామ్ చరణ్ కు తల్లిగా నటించింది. రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇటీవలే మిరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రియా శరణ్.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన బాలు సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. ఇక పెళ్లి, పిల్లల తర్వాత హీరోయిన్ గానే కాకుండా సహాయక నటిగానూ మెరుస్తోంది శ్రియ. అలా ఓ సినిమాలో రామ్ చరణ్ కు తల్లిగా నటించింది శ్రియ. ఆ సినిమా మరేదో కాదు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రియ రామ్ చరణ్ తల్లిగా కనిపించింది.
శ్రియ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
కాగా 40 ప్లస్ లోనూ తన అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ నిస్తోంది శ్రియ. ఇటీవల మిరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుందీ ముద్దుగుమ్మ. ఇందులో శ్రియ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
కూతురితో శ్రియ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








