AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనిమనిషి చేతుల్లోనూ మోసపోయా.. ప్రసాద్ బెహరా షాకింగ్ కామెంట్స్..

యూట్యూబ్‌ స్టార్ ప్రసాద్ బెహరా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలను, ఆర్థిక దృక్పథంపై కీలక విషయాలు వెల్లడించాడు. ఒకప్పుడు తాను మనుషులను త్వరగా నమ్మేవాడినని.. అయితే కొన్ని సంఘటనల వల్ల ఆ నమ్మకం సన్నగిల్లిందని చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు ఇలా..

పనిమనిషి చేతుల్లోనూ మోసపోయా.. ప్రసాద్ బెహరా షాకింగ్ కామెంట్స్..
Prasad Behara'
Ravi Kiran
|

Updated on: Oct 21, 2025 | 8:46 PM

Share

యూట్యూబ్‌ స్టార్ ప్రసాద్ బెహరా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలను, ఆర్థిక దృక్పథంపై కీలక విషయాలు వెల్లడించాడు. ఒకప్పుడు తాను మనుషులను త్వరగా నమ్మేవాడినని.. అయితే కొన్ని సంఘటనల వల్ల ఆ నమ్మకం సన్నగిల్లిందని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లో పనిచేసిన ఒక మహిళకు అధిక జీతం ఇచ్చి.. వారానికో కిలో మటన్, కుటుంబంతో సినిమా టిక్కెట్లు, నెలవారీ సరుకులు వంటి అనేక సౌకర్యాలు కల్పించినప్పటికీ, ఆమె తన విలువైన వాచీలను దొంగిలించి కేవలం 400 రూపాయలకు అమ్మేసిందని తెలిపాడు.

ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, మనుషులపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసిందని ప్రసాద్ బెహరా పేర్కొన్నాడు. ఇప్పుడు తాను ఎవరినీ నమ్మడం లేదని చెప్పాడు. డబ్బు సంపాదనపై, ఖర్చులపై తన దృక్పథం మారిందని, పొదుపుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని, నచ్చినవి కొనుక్కోవడానికి వెనుకాడనని అన్నాడు. తన జీవిత ప్రయాణం ఇతరులకంటే భిన్నంగా ఉందని, అన్ని సమస్యలను నవ్వుతూ ఎదుర్కొంటున్నానని ప్రసాద్ బెహరా వివరించాడు.

ఇది చదవండి: ఎవడు మమ్మీ వీడు.! 42 ఫోర్లతో 437 పరుగులు.. దెబ్బకు బౌలర్లను పేకాటాడేశాడుగా