చిరు ఇంట తారల దీపావళి వేడుక నాగ్, వెంకీ, నయన్‌ల సందడి
దీపావళి పండగను సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవలే బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ లతో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు హాజరయ్యారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సోమవారం (అక్టోబర్ 20) సాయంత్రం జరిగిన దీపావళి వేడుకల్లో టాలీవుడ్ స్టార్లు నాగార్జున, వెంకటేశ్, లేడీ సూపర్ స్టార్ నయనతార సందడి చేశారు.
ఈ వేడుకల ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకోగా, ఈ హీరోల మధ్య ఉన్న నిజమైన స్నేహబంధం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. దీపావళి వేడుకల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి.. వెంకటేశ్, నాగార్జునలతో కలిసి పోజులిచ్చారు. మరో చిత్రంలో అతడు ఈ ఇద్దరు నటులకు, వారి కుటుంబాలకు దీపావళి బహుమతులు అందిస్తూ కనిపించాడు. ఇంకో ఫోటోలో, మన శంకర వరప్రసాద్ గారు మూవీ సహనటి నయనతారకు శంఖాన్ని గిఫ్ట్‌గా ఇస్తూ చిరు కనిపించారు. ఈ ఫోటోలను పంచుకుంటూ “ప్రియ మిత్రులైన నాగ్, వెంకటేష్, నా సహనటి నయనతార.. వారి కుటుంబాలతో కలిసి దీపావళి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మధుర క్షణాలు మన హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. జీవితాన్ని నిజంగా కాంతిమయం చేసే ప్రేమ, నవ్వు, కలిసి ఉండడం ఎంత ముఖ్యమో ఇవి గుర్తు చేస్తాయి” అని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశాడు. ఇక..స్టార్స్ అంతా కలిసి దీపావళి జరుపుకోవడం చూసి వారి వారి అభిమానులు సంతోషపడిపోతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలకు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. “వావ్.. ఇదే నిజమైన స్నేహం. కొత్త నటులు మెగాస్టార్‌ని చూసి చాలా నేర్చుకోవాలి’ అని రాశారు. మరొక అభిమాని ‘టాలీవుడ్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ముగ్గురు హీరోలది అతిపెద్ద పాత్ర” అని కితాబిచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. మంగళవారం తులం ఎంతంటే ??
సమంత దీపావళి సెలబ్రేషన్స్‌రాజ్ నిడిమోరు కుటుంబంతో
బంగాళాఖాతంలో అల్పపీడనం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

