Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. మంగళవారం తులం ఎంతంటే ??
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీపావళి పండగ రోజు కాస్త దిగి వచ్చిన బంగారం ధర.. మంగళవారం నాటికి మళ్లీ పెరిగింది. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బంగారం ధరల పెరుగుదలకి కారణం అవుతున్నాయి.గత కొన్ని రోజుల నుంచి అల్ టైమ్ హై లెవెల్స్ ని టచ్ చేస్తూ వెళ్తున్న బంగారం ధరకి రెండు రోజుల పాటు బ్రేక్ పడినా.. దీపావళి మరునాడే తులం రెండు వేలకు పైగా పెరగటం విశేషం.
అటు.. మంగళవారం వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. అక్టోబర్ 21, మంగళవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,35,180 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల తులం పుత్తడి ధర రూ.1,25,180 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,88,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,920 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,21,850 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,770 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,21,700 ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,090 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,22,900 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,770 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,21,700 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, రాజకీయ అనిశ్చిత నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో పసిడికి భారీ డిమాండ్ ఏర్పడింది. మరో వైపు వెండి ధరలు కూడా గత కొంతకాలంగా పరుగులు పెడుతున్నాయి. వెండి వినియోగం ఎక్కువ కావడంతో పాటు వెండి ని కూడా సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో వెండి ధరలు రోజు రోజుకీ పై పైకి చేరుకుంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమంత దీపావళి సెలబ్రేషన్స్‌రాజ్ నిడిమోరు కుటుంబంతో
బంగాళాఖాతంలో అల్పపీడనం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
అద్భుతం.. శ్రీకృష్ణుడి విగ్రహానికి చూపులేని లేగ ప్రదక్షిణలు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

