అద్భుతం.. శ్రీకృష్ణుడి విగ్రహానికి చూపులేని లేగ ప్రదక్షిణలు
హైదరాబాద్ నగర శివారులోని బాటసింగారం వద్ద గల జాఫర్‌గూడలో ఒక ఆశ్చర్య ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. చూపులేని ఒక లేగదూడ ప్రతి రోజు శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విశేషం ‘యుగతులసి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గో మహాక్షేత్రంలో జరుగుతోంది. సుమారు రెండేళ్ల వయసున్న ఈ లేగదూడకు ‘సంధ్య’ అని పేరు పెట్టారు.
ఫౌండేషన్ సభ్యులే ఈ దృశ్యాన్ని రోజూ అది చేస్తోన్న పని చూసి ఆశ్చర్యపోతున్నారు. రెండేళ్ల క్రితం కబేళాకు తరలిస్తున్న ఓ గోమాతను తాము రక్షించామని ఫౌండేషన్ ఛైర్మన్, టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ తెలిపారు. కొన్ని రోజులకే ఆ గోమాత ఈ లేగదూడకు జన్మనివ్వగా దానికి .. సంధ్య అని పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. చూపులేని ఈ లేగదూడ గోమహాక్షేత్రంలోని శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ ప్రతి ఉదయం,సాయంత్రం సమయాల్లో దాదాపు 15 నిమిషాల పాటు ప్రదక్షిణలు చేస్తోంది. దానికి అలా చేయడాన్ని ఎవరూ శిక్షణ ఇవ్వలేదని ఆయన వివరించారు. ఈ దృశ్యాన్ని శివకుమార్ స్వయంగా వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది. చాలా మంది ఈ దృశ్యాన్ని చూసి.. ఇది భక్తి, దైవానుగ్రహం కలిసిన అరుదైన సంఘటన అని కామెంట్లు చేస్తున్నారు.‘నందగోకులం’ పేరుతో గోమహాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కుటీరంలో ఈ లేగదూడ సంధ్యను సంరక్షిస్తున్నారు. ప్రతిరోజూ భక్తి భావంతో శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ తిరుగుతున్న ఈ దూడను చూసి.. ఆ ప్రదేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ మంత్ర ముగ్ధులవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dil Raju: బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న దిల్ రాజు
Sudheer Babu: సుధీర్ బాబు కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీ
ఫైనల్ రిపోర్ట్.. దర్శన్‌కు బిగ్ ఝలక్
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

