Kantara Chapter 1: కాంతార దెబ్బకు.. ఛావా రికార్డ్ బ్లాస్ట్
కాంతార చాప్టర్ 1 మూవీ.. బాక్సాఫీస్ దగ్గర స్టిల్ కలెక్షన్స్‌ను రాబడుతూనే ఉంది. ఎన్నో అంచనాల మధ్య కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ఇంట్రెస్టింగ్ బజ్‌ను తెచ్చుకుంది. ఈక్రమంలోనే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ సినిమాపై తెలియని క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఆ క్యూరియాసిటీని.. అంచనాలను పర్పెక్ట్‌గా హ్యాండిల్ చేయడంతో.. కాంతార చాప్టర్ 1 బిగ్ హిట్ అయింది.
కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఛావా సినిమానే టార్గెట్ చేసింది. రేపో మాపో.,. ఈసినిమా కలెక్షన్స్‌ను బీట్ చేసేలా కనిపిస్తోంది. దసరా కానుకగా రిలీజైన కాంతార 1 మూవీ.. కేవలం 16 రోజుల్లోనే రూ. 717 కోట్ల కలెక్షన్లు సాధించింది. కాంతారా: చాప్టర్ 1′ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన హిందీ చిత్రం ‘ఛావా’ ప్రపంచవ్యాప్తంగా రూ. 830 కోట్లు వసూలు చేసింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. కానీ ఇప్పుడు రిషబ్ చిత్రం ‘ఛావా’ ఆ రికార్డును బద్దలు కొట్టి నంబర్ 1 స్థానానికి చేరుకునే దిశగా దూసుకుపోతోంది. ‘ఛావా’ ఓవరాల్ గా రూ. 830 కోట్లు వసూలు చేసింది. కానీ ‘కాంతార: చాప్టర్ 1’ కేవలం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లు వసూలు చేసింది. ఈ దీపావళి ముగిసే నాటికి ‘కాంతార: చాప్టర్ 1’ ఈ సంవత్సరం విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరిస్తుంది. అంతే కాదు, రూ. 1000 కోట్ల మైలురాయిపై కూడా దృష్టి సారించనుంది. ఈ సంవత్సరం విడుదలైన ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేయలేదు. ‘కాంతార: చాప్టర్ 1’ కలెక్షన్ స్పీడ్ చూస్తుంటే, రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక కాంతార ఛాప్టర్1 విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు హీరో రిషబ్ శెట్టి. సినిమాను మరింత ప్రమోట్ చేస్తూ ప్రధాన నగరాలన్నీ చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంతార ఛాప్టర్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో వారణిసి వెళ్లాడు ఈ హీరో. అక్కడ కుటుంబ సమేతంగా పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నాడు. ప్రత్యేక పూజలు కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ దీపావళి రష్మికకు ఎందుకంత స్పెషల్
దీపిక రూట్లో ఆలియా.. అలా ఫిక్సయ్యారా ??
వెంకీ డైరక్షన్‌లో మాస్ మహరాజ్.. స్టోరీ రెడీయా ??
దీపావళి పార్టీ ఇచ్చిన బండ్ల గణేష్… కారణం ఉందా
Vishal: అవార్డులు చెత్తబుట్టలో వేస్తానన్న విశాల్.. అసలేమైంది
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

