AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Movie: బ్లాక్ బస్టర్ మూవీ ‘బేబీ’ని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరో ఎవరో తెలుసా?అతనే గనక చేసి ఉంటేనా?

2023లో రిలీజైన బేబీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి చూశారు. కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో వచ్చాయి. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన బేబీ సినిమా 90 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది.

Baby Movie: బ్లాక్ బస్టర్ మూవీ 'బేబీ'ని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరో ఎవరో తెలుసా?అతనే గనక చేసి ఉంటేనా?
Baby Movie
Basha Shek
|

Updated on: Oct 21, 2025 | 8:47 PM

Share

ఏ మాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా బేబీ. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో . ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన బేబీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకక్కించినప్పటికీ సుమారు 90 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గోవర్ధన మారుతీ, ఎస్‍కేఎన్ నిర్మించిన ఈ సినిమాలో చాలా మంది నటించారు. నాగబాబు, హర్ష చెముడు, లిరిష, కుసుమ, బబ్లూ, కిర్రాక్ సీత తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇదే సినిమాకు గానూ జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు డైరెక్టర్ సాయి రాజేష్. అయితే ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించాల్సిందట. ఈ సినిమాలోని విరాజ్ పాత్రకు ముందు విశ్వక్ ను అనుకున్నారట డైరెక్టర్ సాయి రాజేష్. ఇందుకోసం విశ్వక్ ను కూడా సంప్రదించాడట. అయితే కొన్ని కారణాలతో విశ్వక్ సేన్ ఈ సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట.

బేబీ సినిమా సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి. ‘ఒక హీరో ఈ సినిమాను వద్దు అన్నాడు.. కథ కూడా వినకుండానే.. వీడితో సినిమా చేసేది ఏంటి అన్నట్లు మాట్లాడాడు’ అని సాయి రాజేష్ చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వెంటనే విశ్వక్ కూడా ఈ విషయంపై ఘాటుగానే స్పందించాడు. ‘నో అంటే నో .. అరవడం ఎందుకు.. కూల్ గా ఎవరి పని వాళ్లు చేసుకుందాం’ అని రిప్లై ఇచ్చాడు. అంటే బేబీ సినిమాను రిజెక్ట్ చేసినది విశ్వక్ సేనే అని క్లియర్ గా అర్థమైంది. అయితే విశ్వక్ సేన్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదైందని అప్పట్ల అతని అభిమానులు అభిప్రాయపడ్డారు. సెకెండ్ హీరోగా, అందులోనూ ఓ అమ్మాయి చేతిలో మోసపోయే కుర్రాడి పాత్రలో విశ్వక్ సేన్ అసలు సూట్ కాడన్నారు.

ఇవి కూడా చదవండి

విశ్వక్ సేన్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా