Actor : లెజెండరీ నటుడి మనవరాలు.. స్టార్ హీరో సిస్టర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
ప్రస్తుతం సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అటు సినీతారలు సైతం అటు నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తమ పర్సనల్ లైఫ్ విషయాలను సైతం పంచుకుంటున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో తన సిస్టర్ చిన్ననాటి ఫోటో నెట్టింట షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు. ఇంతకీ ఆ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా.. ?

సోషల్ మీడియాలో ప్రపంచంలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెగ వైరలవుతుంది. ముఖ్యంగా తారల చిన్ననాటి ఫోటోస్, త్రోబ్యాక్ వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ స్టార్ హీరో తన సిస్టర్ చిన్ననాటి పిక్ షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఆమె లెజెండరీ నటుడి మనవరాలు. అంతేకాదు.. ఆమె సోదరుడు తెలుగులో క్రేజీ హీరో. సెలబ్రెటీ ఫ్యామిలికీ చెందినప్పటికీ మీడియాకు దూరంగా ఉంటారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ? అక్కినేని హీరో అనుమోలు సుశాంత్.
ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?
టాలీవుడ్ హీరో సుశాంత్ అనుమోలు.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కానీ అంతగా స్టార్ స్టేటస్ మాత్రం సంపాదించుకోలేకపోయారు. ప్రస్తుతం సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తన సిస్టర్ సంగీత అనుమోలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆమె చిన్నప్పటి ఫోటోను షేర్ చేశారు. ఇందులో బాల్యంలో అమ్మా, నాన్నతో తన సిస్టర్ దిగిన ఫోటోను పంచుకున్నారు. ఈ పోస్టుకు సంగీత సైతం రిప్లై ఇచ్చింది.
ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..
సుశాంత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. వరుణ్ కుమార్, రాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 18న సుశాంత్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఇదేం సినిమా రా బాబోయ్.. యాక్షన్, సస్పెన్స్, ట్విస్టులతో బుర్రపాడు.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది..







