- Telugu News Photo Gallery Cinema photos Sivakarthikeyan Praises Telugu Cinema's Content, Reveals Tollywood's 1000 Crore Secret
Siva Karthikeyan: టాలీవుడ్‌పై కోలీవుడ్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా ఎలా..
మన గురించి మనమే గొప్పగా చెప్పుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి..? బయటి ఇండస్ట్రీ నుంచి ఒకరొచ్చి.. మీరు తోపుల్రా సామీ అన్నపుడే కదా అసలు కిక్కు. తాజాగా ఓ హీరో కామెంట్స్ విన్నాక.. తెలుగు సినిమా ఫ్యాన్స్ ఇలాగే కాలర్ ఎగరేస్తున్నారు. మరి అంతగా కిక్ ఇచ్చిన ఆ కామెంట్స్ ఏంటి..? ఆ కామెంట్ చేసిన హీరో ఎవరు..?
Updated on: Sep 02, 2025 | 8:03 PM

ఒకప్పుడు తెలుగు సినిమాలకు 1000 కోట్లు అంటే కల.. కానీ దాన్ని రాజమౌళి చాలా సింపుల్ చేసారు. బాహుబలి 2 తర్వాత ట్రిపుల్ ఆర్, పుష్ప 2 సినిమాలు 1000 కోట్లు క్రాస్ చేసాయి.

మనోళ్లను చూసి కన్నడలో కేజియఫ్ 2.. హిందీలో పఠాన్, జవాన్ కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసాయి. కానీ తమిళ ఇండస్ట్రీకి ఇది సాధ్యం కాలేదు.. దీనిపైనే శివకార్తికేయన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

సెప్టెంబర్ 5న మదరాసి సినిమాతో రాబోతున్నారు శివకార్తికేయన్. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో కంటెంట్ అదిరిపోతుంది కాబట్టి 1000 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి.. అదే టాలీవుడ్ సీక్రేట్ అన్నారు.

అయితే మురుగదాస్ మాత్రం ఆ మధ్య 1000 కోట్ల సినిమాలపై చేసిన కామెంట్స్ బాగా నెగిటివ్ అయ్యాయి. తమిళ దర్శకులు ఎడ్యుకేట్ చేస్తారని.. 1000 కోట్ల సినిమాలు ఎంటర్‌టైన్మెంట్ ఇస్తాయన్నారు మురుగదాస్.

ఈయన కామెంట్స్ వైరల్ అయ్యేసరికి మదరాసిపై నెగిటివిటీ వచ్చేసింది.. దాన్ని కవర్ చేయడానికి శివకార్తికేయన్ తెలుగు సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. కంటెంట్ విషయంలో టాలీవుడ్ టాప్ అన్నారాయన. మొత్తానికి మన సినిమా గొప్పతనం పరభాషా హీరోలు సైతం కాదనలేకపోతున్నారు.




