- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Sahar Krishnan Wears A Special Saree With Pawan Kalyan Photos, See pics Here
Pawan Kalyan: పవన్ కల్యాణ్ అంటే ఎంత అభిమానమో! పవర్ స్టార్ ఫొటోలతో చీర కట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 02). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం పవర్ స్టార్ కు వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పింది.
Updated on: Sep 02, 2025 | 7:44 PM

1. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 02) సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోన్న ఓ ముద్దుగుమ్మ మాత్రం పవర్ స్టార్ కు వెరైటీ గా బర్త్ డే విషెస్ చెప్పింది.

2. పవన్ పుట్టిన రోజును పురస్కరించుని ఆయన ఫొటోలు అతికించిన స్పెషల్ చీర కట్టుకొని వెరైటీగా శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు ఇదే చీరతో పవన్ నటించిన ఒక సినిమా పాటకు రీల్స్ కూడా చేసింది

3. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ అభిమానులు ఈ ఫొటోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు

4. కాగా ఇప్పుడే కాదు గతంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కూడా ఇలాగే చిరంజీవి ఫొటోలు అతికించిన చీరను కట్టుకుని ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా?

5. ఇటీవలే ఆహాలో వచ్చిన వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ తో పాటు గతంలో పలు సినిమాలు, సిరీసుల్లో నటించిన సహర్ కృష్ణన్. 2018లో మిస్ ఆంధ్ర ప్రదేశ్‌గా ఎంపికైన ఈ అమ్మడు మలబార్ గోల్డ్, కంచి కామాక్షి సిల్క్స్ , ఉప్పాడ, మిత్ర వంటి పలు కంపెనీలకు మోడల్‌గా పనిచేసింది

6. ఇక ‘బిహైండ్ సమ్‌వన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సహర్ కృష్ణన్ తన మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఊరి చివర అనే మరో సినిమాలో యాక్ట్ చేసింది. ఇక ఆహా వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ తో మరింత ఫేమ్ సొంతం చేసుకుంది.




