Tollywood: వామ్మో.. ఒక్కసారిగా భయపెట్టేసిన అందాల తార.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
భయంకరమైన గెటప్‌లో కనిపిస్తున్న ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేసిన పోటో చూసి షాకవుతున్నారు నెటిజన్స్. దెయ్యం మేకప్‌తో సడెన్ గా భయపెట్టేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయిన చేస్తుంటారు తారలు. కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి తమ శరీరాకృతిలో మార్పులు చేస్తుంటారు. కొన్నిసార్లు బరువు పెరగడం.. తగ్గడం చూస్తుంటాం. కానీ హారర్ కంటెంట్ సినిమా కోసం తమ రూపాన్ని మార్చుకుని అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది ఓ హీరోయిన్. పైన ఫోటోను చూశారు కదా.. అందులో భయంకరమైన గెటప్‌లో కనిపిస్తున్న ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేసిన పోటో చూసి షాకవుతున్నారు నెటిజన్స్. దెయ్యం మేకప్‌తో సడెన్ గా భయపెట్టేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ శ్రేయ ధన్వంతరి.
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో కనిపించింది శ్రేయా ధన్వంతరి. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. జోష్ చిత్రంలో చైతూకు కాలేజీలో స్నేహితురాలిగా కనిపించింది. జోష్ మూవీ తర్వాత సందీప్ కిషన్ నటించిన స్నేహగీతం చిత్రంలో నటించింది. అందం, అభియనంతో మెప్పించిన శ్రేయా ధన్వంతరి.. పలు టీవీ యాడ్స్ కూడా చేసింది. కానీ తెలుగు చిత్రపరిశ్రమలో ఈ అమ్మడుకు అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో మెల్లిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది. అక్కడ లేడీస్ రూమ్ యూట్యూబ్ సిరీస్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ చాలా బిజీ అయ్యింది.
దుల్కర్ సల్మాన్ నటించిన చుప్ సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. గన్స్ అండ్ గులాబ్స్, స్కామ్ 1992, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది శ్రేయా ధన్వంతరి. ఇప్పుడు అద్భుత్, నౌషికియేలో నటిస్తుంది. హారర్ థ్రిల్లర్ జోనల్ తెరకెక్కిన అద్భఉత్ చిత్రం సెప్టెంబర్ 15న సోనీ మ్యాక్స్ లో ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలోని దెయ్యం మేకప్ ఫోటో షేర్ చేసింది. ఈ సినిమాలో శ్రేయా ధన్వంతరి దెయ్యంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.