AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 Movie : 3 సినిమాలో శ్రుతిహాసన్ చెల్లి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

ధనుష్ నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు ఈ హీరో. అలాగే తెలుగు, తమిళ్ , హిందీ భాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమా చేశాడు. రీసెంట్ గా రాయన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ధనుష్. ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు.

3 Movie : 3 సినిమాలో శ్రుతిహాసన్ చెల్లి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2024 | 12:28 PM

Share

స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. ధనుష్ నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు ఈ హీరో. అలాగే తెలుగు, తమిళ్ , హిందీ భాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమా చేశాడు. రీసెంట్ గా రాయన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ధనుష్. ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ధనుష్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా త్రీ(3). 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల అయింది.

ఇది కూడా చదవండి : NTR: “తారక్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు.. నా వల్ల కాలేదు”.. ఎమోషనల్ అయిన రాజేంద్ర ప్రసాద్

ఈ సినిమాకు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా శ్రుతిహాసన్ నటించింది. అలాగే ఈ సినిమాలో టీనేజ్ లవ్ స్టోరీ కూడా చూపించారు. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా.? ఆ చిన్నదాని పేరు గాబ్రియెల్లా నటాలీ చార్ల్టన్. పలు సినిమాల్లో ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. అలాగే తమిళ్ బిగ్ బాస్ లోనూపాల్గొంది ఈ అమ్మడు.

ఇది కూడా చదవండి : రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న భామ.. ఎవరో తెలుసా.?

ఈ చిన్నది తన 9వ ఏట ఉంచి నటించడం మొదలు పెట్టింది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేసింది ఈ అమ్మడు. అలాగే పలు డాన్స్ రియాల్సిటీ షోస్ లోనూ పాల్గొంది.అదే సమయంలో త్రీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ మూవీలో శ్రుతి చెల్లిగా కనిపించింది. ఆ సినిమా వచ్చిన మూడేళ్లకు హీరోయిన్ అయ్యింది. అప్పా చిత్రంలో రషిత పాత్రలో మెరిసింది. ఆతర్వాత ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇచ్చి చదువుల పై దృష్టి పెట్టింది. ఇక ఇప్పుడు తిరిగి స్మాల్ స్క్రీన్ పై మరోసారి సందడి చేస్తోంది. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరో వైపు సీరియల్స్ లోనూ నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి :మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంటమ్మా..! తేజ్ కోసం అదిరిపోయే పాట పాడిన స్టార్ యాంకర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.