Tollywood: త్వరలోనే హీరోయిన్గా టాలీవుడ్ స్టార్ హీరో కూతురు.. ఫాలోయింగ్ వేరేలెవల్..
తెలుగు సినీ పరిశ్రమలో తాత, తండ్రి స్టార్ హీరోస్. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ సైతం రాబోతుంది. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తనకు నటనపై ఆసక్తి ఉందని.. త్వరలోనే సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఈ అమ్మడు సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో కూతురు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. అటు సొంతంగా యూట్యూబ్ ఛానల్.. ఇటు ఇన్ స్టాలో నిత్యం క్రేజీ ఫోటోస్, ఫ్యామిలీ ఫోటోస్ పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుంది. ఇక త్వరలోనే సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇవ్వనుంది. ఇంతకీ ఫైన ఫోటోలో మిర్రర్ ముందు సెల్ఫీ తీసుకుంటున్న ఈ కర్లీ హెయిర్ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ? టాలీవుడ్ స్టార్ హీరో కూతురు. తనే సితార ఘట్టమనేని. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి. సితార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నప్పటి నుంచి నెట్టింట చాలా యాక్టివ్. అలాగే పలు యాడ్స్ సైతం చేసింది. ప్రస్తుతం ఓ ప్రముఖ జ్యువెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఆ సంస్థకు సంబంధించిన పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది.
ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్న సితార.. నిత్యం క్రేజీ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సూపర్ స్టార్ అభిమానులకు దగ్గరవుతుంది. తాజాగా వెకేషన్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫ్లోరెన్స్ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం సితార షేర్ చేసిన పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. సితార త్వరలోనే సినీరంగంలోకి కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతుంది. నటనపై ఆసక్తి ఉండడంతో ఇప్పటికే యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో ప్రమోషన్ సాంగ్ లో తన తండ్రితో కలిసి డ్యాన్స్ చేసింది సితార. అలాగే ఇప్పుడు సైతం తన తండ్రి మహేష్ బాబుతో కలిసి పలు యాడ్స్ చేస్తుంది.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త ప్రాజెక్టులో నటిస్తున్నాడు. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీని రూపొందిస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ కావడంతో మహేష్ తన ఫ్యామిలీ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :