- Telugu News Photo Gallery Cinema photos Telugu Cinema Actress Anshu Ambani Latest Blue Saree Photos Goes Viral
Anshu Ambani: బాబోయ్.. పూలచీరలో వెర్రెక్కిస్తోన్న వయ్యారి.. 40 ఏళ్ల వయసులోనూ కట్టిపడేస్తోన్న అన్షు..
అక్కినేని నాగార్జున నటించిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ మన్మథుడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే కుర్రకారును కట్టిపడేసిన వయ్యారి అన్షు అంబానీ. ఈ మూవీ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది.
Updated on: Apr 13, 2025 | 3:48 PM

అన్షు అంబానీ.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్. మన్మథుడు సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగులో కేవలం రెండు సినిమాల్లోనే నటించింది. కానీ అప్పటికీ ఆమెకు అంతగా క్రేజ్ రాలేదు.

దీంతో సినిమాలకు దూరంగా ఉండిపోయిన అన్షు..పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇటీవలే సుమారు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా చిత్రంలో కీలకపాత్రలో నటించింది.

మజాకా సినిమా సూపర్ హిట్ కావడమే కాదు.. మరోసారి తన నటనకు మరోసారి ప్రశంసలు అందుకుంది. దీంతో ఇప్పుడు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తే చేసేందుకు రెడీగా ఉంది అన్షు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో అన్షు చాలా యాక్టివ్.

నిత్యం తన ఫ్యామిలీతోపాటు తన క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు నీలిరంగు పూలచీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది. వయ్యారాల సింగారంతో ఫాలోవర్లను కట్టిపడేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 40 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం చెక్కు చెదరని అందంతోపాటు.. కుర్రహీరోయిన్లకు సైతం టెన్షన్ పుట్టించే ఫిట్నెస్ తో నెట్టింట అల్లాడించేస్తుంది అన్షు.




