దివి నుంచి దిగివచ్చిన రంగుల చిలక.. ఈ అమ్మడి సోయగానికి ఎవరైనా పడిపోవాల్సిందే
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి పాపులర్ అయిన దివి.. ఆతర్వాత విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల పట్ల ఆసక్తితో 2017లో మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది ఈ అమ్మడు. 2018లో "లెట్స్ గో" అనే లఘు చిత్రంతో నటనలోకి అడుగుపెట్టింది. 2019లో మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది.
Updated on: Apr 13, 2025 | 1:38 PM

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి పాపులర్ అయిన దివి.. ఆతర్వాత విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల పట్ల ఆసక్తితో 2017లో మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది ఈ అమ్మడు. 2018లో "లెట్స్ గో" అనే లఘు చిత్రంతో నటనలోకి అడుగుపెట్టింది.

2019లో మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ గా చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత ఏ1 ఎక్స్‌ప్రెస్ (2019), క్యాబ్ స్టోరీస్ (2021), గాడ్ ఫాదర్ (2022) వంటి సినిమాల్లో నటించింది.

మొన్నామధ్య దివి నటించిన లంబసింగి (2024) సినిమా హీరోయిన్‌గా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. దివి 2020లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొని విశేషమైన గుర్తింపు పొందింది. ఈ షో ఆమెకు బాగా పాపులారిటీ తెచ్చిపెట్టింది.

హైదరాబాద్ టైమ్స్ 2020లో ఆమెను టీవీ రంగంలో మోస్ట్ డిజైరబుల్ వుమన్గా ప్రకటించింది. దివి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఆమె సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మరియు ఫ్యాషన్ ఈవెంట్‌లలో సందడి చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది.

తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. ఈ ఫొటోల్లో తన అందంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కు మరిన్ని సినిమా ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నారు.





























