- Telugu News Photo Gallery Cinema photos Listening to the songs in Hanu Raghavapudi movies is like pouring nectar into your ears.
Hanu Raghavapudi: హను సినిమాల్లో ఒక్కో పాట ఒక్కో డైమండ్.. చెవిలో అమృతం పోసిన్నట్టు..
హను రాఘవపూడి.. సీతా రామం మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఈయన దర్సకత్వంలో వచ్చిన తొలి రెండు సినిమాలు అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మంచి విజయాన్ని అందుకున్నాయి. లై, పడి పడి లేచే మనసు సినిమాలు నిరాశ మిగిల్చాయి. ఈ చేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాల మ్యూజిక్ హిట్ అయింది అనే చెప్పాలి.
Updated on: Apr 13, 2025 | 12:43 PM

అందాల రాక్షసి.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి దీనిని నిర్మించారు. ఎస్.ఎస్. రాజమౌళి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ హీరోలు. లావణ్య త్రిపాఠి కథానాయిక నటించిన తోలి చిత్రమిది. ఈ సినిమాకి రధన్ అందించిన మ్యూజిక్ మనసును హత్తుకుంది.

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ.. నాని హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమాతో మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్గా పరిచయం అయింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కింద రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించారు. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం వో అనిపించింది.

పడి పడి లేచే మనసు.. శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం. హను మూడవ చిత్రంగా వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ తుచ్చుకుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన మ్యూజిక్ మాత్రం సంగీత ప్రేమికులను ఆకట్టుకుంది.

సీతా రామం.. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ టైటిల్ పాత్రల్లో నటించిన పీరియడ్ రొమాంటిక్ డ్రామా చిత్రం. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా పతాకాలపై సి. అశ్వని దత్ నిర్మించిన ఈ మూవీలో రష్మిక మందన్నతో కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన మెలోడియస్ మ్యూజిక్ వింటే చెవిలో అమృతం పోసిన్నట్టు ఉంటుంది.

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా పీరియాడిక్ ఆక్షన్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న హను రాఘవపూడి. ఈ చిత్రంతో కొత్త భామ ఇమాన్ ఇస్మాయిల్ (ఇమాన్వి) హీరోయిన్గా పరిచయం అవుతుంది. దీని చిత్రకారణలో ఓ సీన్‌కి ఇంప్రెస్ అయినా డార్లింగ్.. ఈ దర్శకుడితో మరో సినిమాకి ఒప్పదం కుదుర్చుకున్నారు.





























