- Telugu News Photo Gallery Cinema photos Do you know why Kajal has not acted with Nagarjuna till now?
ఇప్పటి వరకు నాగార్జునతో నటించని కాజల్.. ఎందుకో తెలుసా?
అందాల ముద్దుగుమ్మ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ తెలుగు చిత్రి పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలతో జతకట్టింది. ఒక నాగార్జునతో తప్ప అసలు కాజల్ నాగార్జున తో ఎందుకు నటించలేదో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Apr 13, 2025 | 6:06 PM

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో కాజల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటింది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు రావడంతో వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా సినిమాలు చేస్తూ టాలీవుడ్ నే షేక్ చేసింది ఈ బ్యూటీ.

ఇక టాలీవుడ్ లో జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు చాలా మందితో జతకట్టింది. పెళ్లికి ముందు చాలా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పెళ్లై కొడుకు పుట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. దీంతో కీలక పాత్రల్లో, సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తుంది.

ఇప్పడు టాలీవుడ్ లో దూసుకెళ్తున్న సీనియర్ హీరోల్లో చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లు ముందున్నారు. వీరు వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, కుర్రహీరోలకు పోటినిస్తున్నారు.

అయితే కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ లతో కలిసి నటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఈ బ్యూటీ నాగార్జున, వెంకటేష్ తో కలిసి నటించలేదు. వెంకటేష్ సినిమాలో ఇప్పటి వరకు ఈ అమ్మడుకు అవకాశం రాలేదు. కానీ నాగార్జునతో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కాజల్ మిస్ చేసుకుందంట.

నాగార్జున రగడ మూవీలో కాజల్ కు అవకాశం వచ్చిందంట, ఈ మూవీకి కాజల్ ఒకే చెప్పి చివరి నిమిషంలో క్యాన్సల్ చేసుకున్నదంట. అదే విధంగా ది గోస్ట్ మూవీలో మరోసారి ఛాన్స్ వచ్చినా కాజల్ అగర్వాల్ ఈ మూవీని రిజక్ట్ చేసిందంట. అలా రెండు సార్లు నాగార్జున సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కాజల్ వదులుకుంది. అయితే తాను వదులుకోవడానికి కారణం సరైన కథ దొరకకపోవడమే అంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.





























