- Telugu News Photo Gallery Cinema photos Srimukhi looks beautiful in colorful Langavoni Photo Gallery
కలర్ ఫుల్ డ్రెస్లో కలర్ ఫుల్గా శ్రీముఖి.. ఈ బ్యూటీ అందాలు చూడతరమా..
ట్రెడిషనల్ లుక్ లో తన అందాలతో మరోసారి మాయ చేస్తుంది యాంకర్ శ్రీముఖి. కలర్ ఫుల్ లంగావోణిలో అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ.. తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేయడం తో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా చూసేయండి ఈ బ్యూటీ బ్యూటిఫుల్ ఫొటోస్.
Updated on: Apr 13, 2025 | 6:09 PM

అందాల ముద్దుగుమ్మ బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఓ వై పు సినిమాలు, మరో వైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యంగా చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన నటతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

పటాస్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు, తన కామెడీ, పంచ్ డైలాగ్స్, అల్లరితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా షోలలో ఈ బ్యూటీ చేసే అల్లరి అందరి మనసుకు హాయినిస్తుంది. తన దైన తీరులో కామెడీ పండిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా బిగ్ బాస్ కు వెళ్లి తన వాయిస్, ఆట తీరుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఈ అమ్మడుకు మరింత పాపులారిటీ వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన పరికిణిలో కనిపించి యూత్ కు అందాల విందునిచ్చింది. కలర్ ఫుల్ లంగావోణిలో అచ్చం దేవకణ్యలా మెరిసి పోతుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో, చిలుక పచ్చ కోకలో అందంగా, చూడ ముచ్చడగా ఉన్నావు రాములమ్మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీ అభిమానులు.





























