AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Actress: ఆరు సినిమాలు చేస్తే 4 హిట్సే.. కాంట్రావర్సీ చిత్రాలతో ఫేమస్.. క్రేజ్ మాత్రం పీక్స్..

తెలుగు సినీరంగంలో మొదటి సినిమానే అట్టర్ ప్లాప్. కానీ చూపుతిప్పుకోనివ్వని అందం.. అమాయకమైన యాక్టింగ్ తో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?

Telugu Actress: ఆరు సినిమాలు చేస్తే 4 హిట్సే.. కాంట్రావర్సీ చిత్రాలతో ఫేమస్.. క్రేజ్ మాత్రం పీక్స్..
Adah Sharma
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2025 | 8:48 AM

Share

సాధారణంగా సినీరంగంలో తక్కువ సినిమాలే చేసినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. ఒకటి రెండు సినిమాలతోనే తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు. తెలుగు సినిమాతోనే నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ టాక్ తెచ్చుకోవడంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ.. అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. కానీ అక్కడ కూడా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రధాన కథానాయికగా నటించిన ఈ అమ్మడు.. పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. తాజాగా తన చిన్ననాటి ఫోటోస్ పంచుకుంది. దీంతో ఈ అమ్మడు త్రోబ్యాక్ ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ అదా శర్మ.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నితిన్ కాంబోలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తొలి చిత్రంతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటుంది. ముఖ్యంగా లేడీ ఓరియేంటేడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. కొన్నాళ్ల క్రితమే ఆమె నటించిన కేరళ స్టోరీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న ఈ మూవీ.. ఆ తర్వాత మాత్రం సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

ది కేరళ స్టోరీ తర్వాత కూడా అదే జానర్ చిత్రాలను ఎంచుకుంది. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ, తెలుగులో అవకాశాలకోసం ఎదురుచూస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..