- Telugu News Photo Gallery Cinema photos Movie and TV celebrities attend Mogalirekulu serial fame Anjali baby shower function, See photos
Actress Anjali: అట్టహాసంగా ప్రముఖ నటి సీమంతం.. తరలివచ్చిన తారాలోకం.. ఫొటోలు చూశారా?
సీరియల్స్ తో పాటు పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించింది అంజలి. త్వరలో ఆమె తల్లి కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సీమంతం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Updated on: Jun 26, 2025 | 10:03 AM

చాలా మందికి ఫేవరెట్ అయిన 'మొగలిరేకులు' సీరియల్‌తోనే నటిగా కెరీర్ ప్రారంభించింది అంజలి. ఈ సూపర్ హిట్ సీరియల్ లో తన అందం, అభినయంతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుందీ అందాల తార.

దీని తర్వాత రాధా కల్యాణం, దేవత, శివరంజని తదితర సీరియల్స్ లో నటించింది అంజలి. కొన్నింటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తే.. మరికొన్నింటిలో నెగిటివ్ పాత్రల్లోనూ ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ

సీరియల్స్ తో కొన్ని సినిమాల్లోనూ సహాయక నటిగా మెప్పించింది అంజలి. బాలకృష్ణ లెజెండ్, అక్కినేని నాగ చైతన్య ఒక లైలా కోసం తదితర సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.

సినిమాలు, టీవీ సీరియల్స్ సంగతి పక్కన పెడితే.. 2017లో సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది అంజలి. ఈ దంపతులకు ఇప్పటికే చందమామ అనే కూతురు ఉంది.

ఇప్పుడీ అందాల తార రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించిందామె. తాజాగా అంజలి సీమంతం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు తరలిచ్చారు.

యాంకర్ స్రవంతి, అర్జున్ అంబటి, శ్వేతా నాయుడు, యష్మీ, భానుశ్రీ, సమీరా, రీతూ చౌదరి, ఆర్జే కాజల్, విశ్వ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్ తదితరులు ఈ వేడుకలో తళుక్కుమన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.




