Tollywood: తల్లి, అక్కా ఇద్దరూ పాన్ ఇండియా హీరోయిన్స్.. లక్కు కోసం వెయిట్ చేస్తోన్న అందాల రాశి..
సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కానీ నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడిప్పుడే వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె తల్లి ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు ఆమె అక్క తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

సినీరంగంలో ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న యంగ్ హీరోయిన్లలో ఆమె ఒకరు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ.. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఆమె తల్లి ఓ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఇండస్ట్రీలో తన అక్క చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా.. ? తనే బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఖుషి కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు.. జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే జాన్వీ కపూర్, తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులు కొట్టేసింది జాన్వీ. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న పెద్ది చిత్రంలోనూ నటిస్తుంది. ఇక అక్క బాటలోనే నటిస్తోంది ఖుషి కపూర్. మెల్ల మెల్లగా సినిమా పరిశ్రమలో అడుగులు వేస్తూ వస్తోంది.
ఇటీవల కాలంలో హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చింది ఖుషీ కపూర్. కానీ ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. దీంతో ఈ బ్యూటీకి కావాల్సినంత క్రేజ్ రాలేదు. కానీ ఖుషీ కపూర్ మాత్రం తన కెరీర్ పై నమ్మకంతో ముందుకు సాగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషీ కపూర్.. తన స్కూల్ డేస్ గుర్తుచేసుకుంది. ఆ మసంయలో తాను డీ గ్లామర్ గా ఉండడం వల్ల ఎంతోమంది తనను ఎగతాళి చేసేవారని.. చాలా మందికి సంబంధించిన ప్రేమ లేఖలను తాను ఇచ్చేదాన్ని అని.. ప్రేమికుల మధ్య తనను వారధిగా వాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చింది. తనను అందంగా లేవు అని ఎగతాళి చేసేవారని.. కానీ ఎవరి మాటలు తాను పట్టించుకునేదాన్ని కాదు అన్నారు.
తనకు తానుగా కెరీర్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఖుషి కపూర్ ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకున్నాయి. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు తన నెక్ట్స్ పై ప్రాజెక్ట్స్ పై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు టాక్. అలాగే ఆమె కోసం తన తండ్రి బోనీ కపూర్ సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తన తండ్రి నిర్మాణంలోనే ఖుషి కపూర్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగుతోపాటు తమిళంలోనూ ఆఫర్స్ వస్తే చేసేందుకు రెడీగా ఉందట ఖుషి కపూర్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :