Sonu Nigam: ‘బీజేపీని ఓడించినందుకు అయోధ్య వాసులు సిగ్గు పడాలి’.. వైరల్ ట్వీట్‌పై స్టార్ సింగర్ క్లారిటీ
బాలీవుడ్ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆయన నిర్ణయానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదే ఫేక్ న్యూస్. సోనూ నిగమ్ పేరు మీద చాలా ఫేక్ వార్తలు వస్తున్నాయి. చివరకు సోషల్ మీడియా నుండి నిష్క్రమించినప్పటికీ, కొంతమంది సోనూ నిగమ్ పేరుతో చెడు ప్రచారం చేస్తున్నారు
బాలీవుడ్ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆయన నిర్ణయానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదే ఫేక్ న్యూస్. సోనూ నిగమ్ పేరు మీద చాలా ఫేక్ వార్తలు వస్తున్నాయి. చివరకు సోషల్ మీడియా నుండి నిష్క్రమించినప్పటికీ, కొంతమంది సోనూ నిగమ్ పేరుతో చెడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ సోనూ నిగమ్ పేరు మార్మోగిపోతోంది. దీనికి కారణం అతని పేరు మీద జరుగుతోన్న ఒక ఫేక్ ప్రచారం. అదేంటంటే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఓడిపోయింది. అయోధ్య కూడా ఈ నియోజక వర్గ పరిధిలోకే వస్తుంది. కొన్ని నెలల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ గొప్ప రామమందిరాన్ని ప్రారంభించారు. అలాగే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ అనూహ్యంగా సమాజ్ వాదీ పార్టీకి చెందిన అవధేష్ ప్రసాద్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అయోధ్య ఓటర్లను సోనూ నిగమ్ దారుణంగా తిట్టాడంటూ నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో అతనిపై విమర్శల వర్షం కురుస్తోంది.
‘అయోధ్య మొత్తాన్ని అద్భుతంగా నిర్మించారు. ప్రభుత్వం కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను మంజూరు చేసింది. 500 ఏళ్ల తర్వాత రామమందిరాన్ని నిర్మించారు. ఆలయాన్ని అందంగా నిర్మిస్తున్నారు. అలాంటి పార్టీ అయోధ్యలో గెలవలేదు. అయోధ్య ప్రజలు సిగ్గుపడాలి’ అని ఒక పోస్ట్ సోనూ నిగమ్ సింగ్ అనే ఖాతా నుంచి పోస్ట్ అయ్యింది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సోనూ నిగమ్ స్వయంగా ఈ కామెంట్లు చేశాడని కొందరు పొరపాటు పడ్డారు. దీంతో సింగరే నేరుగా బరిలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. ‘నేనెప్పుడూ అలా అనలేదు. ఏడేళ్ల క్రితమే సోషల్ మీడియా నుంచి తప్పుకోవడానికి ఇదే కారణం’ అని సోను తెలిపారు.
వైరల్ అవుతోన్న ట్వీట్..
जिस सरकार ने पूरे अयोध्या को चमका दिया, नया एयरपोर्ट दिया, रेलवे स्टेशन दिया, 500 सालों के बाद राम मंदिर बनवाकर दिया, पूरी की पूरी एक टेंपल इकोनॉमी बनाकर दी उस पार्टी को अयोध्या जी सीट पर संघर्ष करना पड़ रहा है।
शर्मनाक है अयोध्यावासियों!
— Sonu Nigam (@SonuNigamSingh) June 4, 2024
ప్రజలు, వార్తా ఛానెల్‌లు సోషల్ మీడియా న్యూస్ గురించి కాసింత ఆలోచించకుండా ఎలా వార్తలను వండి వారుస్తారో నాకైతే అర్థం కావడం లేదు. అతని సోషల్ మీడియా హ్యాండిల్ సోనూ నిగమ్ సింగ్ అని చదువుతుంది. తన ఖాతాలో బీహార్‌కు చెందిన క్రిమినల్ లాయర్ అని స్పష్టంగా రాసి ఉంది. ఇలాంటి సమస్యలు ఉంటాయనే నేను ట్విట్టర్‌ని విడిచిపెట్టాను. అలాంటి రాజకీయ ప్రకటన చేయడంలో అర్థం లేదు. ప్రస్తుతం నా పనిపైనే దృష్టంతా ఉంది. ఈ సంఘటన ఒక మేల్కొలుపు పిలుపు. నాకే కాదు నా కుటుంబానికి కూడా’ అని సోనూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.