Ram Charan: బాబాయ్ గెలుపు.. అబ్బాయి సంబరం..! గ్రాండ్ పార్టీ ఇవ్వనున్న రామ్ చరణ్.?
పీఠాపురం నుంచి పోటీ చేసి గెలవడమే కాకుండా తమ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకున్నారు పవన్. దాంతో విజయవంతంగా ఆంధ్రా శాసనసభలో అడుగు పెట్టనున్నారు పవన్. జగన్ ను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. పవన్ విజయంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

రసవత్తరంగా సాగిన ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అలాగే జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది భారీ మెజారిటీతో విజయం సాధించారు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఎన్నికలు జరిగాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఆయన అత్యధిక మెజారిటీతో అక్కడ విజయం సాధించారు. జనసేన పార్టీని స్థాపించి గత పదేళ్లుగా రాజకీయ పునాది కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్‌కి ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు భారీ విజయం దక్కింది. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్‌కు 21 నియోజకవర్గాలు కేటాయించారు.
పీఠాపురం నుంచి పోటీ చేసి గెలవడమే కాకుండా తమ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకున్నారు పవన్. దాంతో విజయవంతంగా ఆంధ్రా శాసనసభలో అడుగు పెట్టనున్నారు పవన్. జగన్ ను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. పవన్ విజయంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పవన్ కు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ పై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.
మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మహేష్ బాబు , ఎన్టీఆర్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు, అలాగే దళపతి విజయ్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేశారు. ఇదిలా ఉంటే పవన్ గెలుపుతో మెగా ఫ్యామిలీ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే తేజ్ మావయ్య ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తమ్ముడు విజయం పై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. బాబాయ్ గెలుపును అబ్బాయి సంబరంగా చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్ ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేయనున్నాడని తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగే ఈ పార్టీకి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే గతంలో రామ్ చరణ్ ప్రతిసారి పవన్ వెన్నంటే ఉన్నారు. పవన్ కోసం తన వంతు సాయం చేస్తూనే ఉన్నారు. బాబాయ్ పిలిస్తే ప్రచారానికి వస్తాను అని కూడా చరణ్ తెలిపారు. ఇటీవల ఎన్నికల ముందు పిఠాపురం కూడా వెళ్లారు చరణ్.
రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




