AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా..! పిచ్చెక్కిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఈ సినిమాకు మొదట్లో కొమరం పులి అని పేరు పెట్టినా ఆదివాసి వీరుడు కొమరం భీం మనుమడు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడుదలైన రెండో రోజు పులి అని పేరు మార్చారు. పవన్ కళ్యాణ్ పోలీసు ఆఫీసర్ గా చేసిన మొట్టమొదటి చిత్రం. 1000కి పైగా థియేటర్లలో విడుదలైన మొదటి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వారెవ్వా..! పిచ్చెక్కిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Puli
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2024 | 1:27 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన సినిమా కొమురం పులి. తమిళ్ దర్శకుడు నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంతకు ముందుకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖుషి సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో కొమురం పులి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు మొదట్లో కొమరం పులి అని పేరు పెట్టినా ఆదివాసి వీరుడు కొమరం భీం మనుమడు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడుదలైన రెండో రోజు పులి అని పేరు మార్చారు. పవన్ కళ్యాణ్ పోలీసు ఆఫీసర్ గా చేసిన మొట్టమొదటి చిత్రం. 1000కి పైగా థియేటర్లలో విడుదలైన మొదటి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది ఈ చిన్నది. ఈ మూవీలో పవన్ తో రొమాన్స్ చేసిన హీరోయిన్ పేరు నికిషా పటేల్. 2010లో వచ్చిన పులి సినిమాతోనే ఈ చిన్నది హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత కన్నడ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఓం త్రీడి అనే సినిమాలో చేసింది. కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు.

అలాగే తెలుగులో అరకు రోడ్ లో, గుంటూరు టాకీస్ 2 సినిమాల్లోనూ నటించింది కానీ అవి మెప్పించలేకపోయాయి. దాంతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసింది. ఈ అమ్మడు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఇక 2019 తర్వాత సినీ ఇండస్ట్రీలో నికిషా పటేల్ యాక్టివ్ గా లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. పులి సినిమా తర్వాత చాలా మందికి ఈ చిన్నది ఫెవరెట్ హీరోయిన్ గా మారింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో గాలిస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఫోటోలు వైరల్ గా మారాయి. నికిషా హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తుంది.

నికిషా పటేల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.