Kangana Ranaut: అక్కడ బంగ్లా అమ్మేసింది.. ఇక్కడ కోట్లు పెట్టి కాస్ట్లీ కారు కొనేసింది

ఈ బాలీవుడ్ బ్యూటీ కోట్ల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB (లాంగ్ వీల్‌బేస్) మోడల్ కంగనా గ్యారేజీకిచేరింది. ముంబైలోని వర్లీలో ల్యాండ్ రోవర్ డీలర్ అయిన మోడీ మోటార్స్ ఈ కారును డెలివరీ చేసింది.

Kangana Ranaut: అక్కడ బంగ్లా అమ్మేసింది.. ఇక్కడ కోట్లు పెట్టి కాస్ట్లీ కారు కొనేసింది
Kangana
Follow us

|

Updated on: Oct 01, 2024 | 8:14 PM

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గత నెలలో ముంబైలోని బాంద్రాలోని పాలిహిల్‌లో తన బంగ్లాను అమ్మేసిన విషయం తెలిసిందే. దీని తరువాత ఈ బాలీవుడ్ బ్యూటీ కోట్ల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లాంగ్ వీల్‌బేస్ (LWB) మోడల్ కంగనా గ్యారేజీకిచేరింది. ముంబైలోని వర్లీలో ల్యాండ్ రోవర్ డీలర్ అయిన మోడీ మోటార్స్ ఈ కారును డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

కంగనా ఇటీవలే పాలి హిల్స్‌లోని తన బంగ్లాను అమ్మేసింది. 2017లో కంగనా ఈ బంగ్లాను రూ.20.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ బంగ్లాను స్టార్ చిత్ర నిర్మాణ సంస్థ మణికర్కనికా ఫిల్మ్స్ కార్యాలయంగా ఉపయోగించారు. ఆ తర్వాత బంగ్లా 32 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ ఆస్తిని చూపిస్తూ డిసెంబర్ 2022లో కంగనా ఐసిఐసిఐ బ్యాంక్ నుండి రూ.27 కోట్ల రుణం తీసుకుంది. అయితే కంగన ఈ బంగ్లాను అమ్మేసిందని వార్తలు వెల్లువెత్తాయి.. కాగా ఈ బంగ్లాను ఎవరు  కొనుగోలు చేశారన్న సమాచారం లేదు. ఆ తర్వాత రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కంగనా మూడు కోట్లకు పైగా ఖర్చు చేసి కారును సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

ఇదిలా ఉంటే కంగనా నటిస్తున్న ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సంబంధించి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమాలో సీబీఎఫ్‌సీ సూచించిన భాగాలను తొలగించేందుకు నటి-నిర్మాత కంగనా రనౌత్ అంగీకరించినట్లు సెన్సార్ బోర్డు హైకోర్టుకు తెలియజేసింది. చిత్ర సహ నిర్మాతలు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన సెన్సార్ బోర్డు ఈ విషయాన్ని బాంబే హైకోర్టుకు తెలియజేసింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను ఆదేశించాలని కోరుతూ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ హైకోర్టును ఆశ్రయించింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సెన్సార్ సర్టిఫికేట్‌కు సంబంధించిన వివాదం కారణంగా విడుదల ఆలస్యమైంది. రిపోర్ట్స్ ప్రకారం, సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 13 కట్స్ సూచించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కంగనా రనౌత్ స్వయంగా దర్శకత్వం వహించారు.

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేపట్టిన పనిలో సక్సెస్ కోసం దసరా రోజున ఈ పరిహారాలు చేసి చూడండి
చేపట్టిన పనిలో సక్సెస్ కోసం దసరా రోజున ఈ పరిహారాలు చేసి చూడండి
ఆగివున్న గూడ్స్‌ రైలును వేగంగా ఢీకొన్న భాగమతి ఎక్స్‌ప్రెస్‌
ఆగివున్న గూడ్స్‌ రైలును వేగంగా ఢీకొన్న భాగమతి ఎక్స్‌ప్రెస్‌
పండుగైనా.. తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..
పండుగైనా.. తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..
నానో కారు తయారీకి అసలు కారణం ఇదా.. రతన్ టాటాకు హేట్సాఫ్..
నానో కారు తయారీకి అసలు కారణం ఇదా.. రతన్ టాటాకు హేట్సాఫ్..
Horoscope Today: ఖర్చుల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
Horoscope Today: ఖర్చుల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
ఇన్‌ఫినిక్స్‌ మరో అద్భుతం.. బడ్జెట్‌లో ఫ్లిప్‌ ఫోన్‌..
ఇన్‌ఫినిక్స్‌ మరో అద్భుతం.. బడ్జెట్‌లో ఫ్లిప్‌ ఫోన్‌..
మరింత అట్రాక్టివ్‌గా వాట్సాప్‌.. త్వరలోనే మరో స్టన్నింగ్‌ ఫీచర్‌
మరింత అట్రాక్టివ్‌గా వాట్సాప్‌.. త్వరలోనే మరో స్టన్నింగ్‌ ఫీచర్‌
సాబుదాన తింటున్నారా.? అయితే ఓసారి ఆలోచించుకోవాల్సిందే..
సాబుదాన తింటున్నారా.? అయితే ఓసారి ఆలోచించుకోవాల్సిందే..
గూడ్స్‌ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్‌.. రెండు బోగీల్లో మంటలు!
గూడ్స్‌ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్‌.. రెండు బోగీల్లో మంటలు!
బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక గ్లామర్ డోస్ పెంచిన నైనిక.. ఫొటోస్
బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక గ్లామర్ డోస్ పెంచిన నైనిక.. ఫొటోస్