AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. హింట్ ఇచ్చేసిన తల్లి.. ఎవరంటే..

కొన్నాళ్ల క్రితం వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది హీరోయిన్ శ్రీలీల. దమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుని.. ఆ తర్వాత దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో థియేటర్లలో సందడి చేసింది. కానీ ఈ బ్యూటీ ఖాతాలో ప్లాపులు రావడంతో నెమ్మదిగా సినిమాలు తగ్గించింది. ఇప్పుడు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది ఈ అమ్మడు.

Sreeleela: బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. హింట్ ఇచ్చేసిన తల్లి.. ఎవరంటే..
Sreeleela
Rajitha Chanti
|

Updated on: Mar 12, 2025 | 11:40 AM

Share

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు నితిన్ సరసన ఆమె నటించిన రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ దగ్గరపడింది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇటు తెలుగులోనే కాకుండా అటు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది శ్రీలీల. కొన్నాళ్లుగా ముంబైలో పలు మూవీ ఈవెంట్స్, పార్టీలలో కనిపిస్తుంది ఈ అమ్మడు. ఇటీవలే సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ తో సన్నిహితంగా కనిపించింది. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందంటూ ప్రచారం నడిచింది. కట్ చేస్తే.. హిందీలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు శ్రీలీల పర్సనల్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ఆమె డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీలీల.. ఇప్పుడు బీటౌన్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉందని టాక్ నడుస్తుంది. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా ఉండనున్నట్లు టాక్. అయితే ఈ మధ్యే కార్తీక్ ఆర్యన్ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కలిసి పార్టీ చేసుకుంటే శ్రీలీల కూడా అక్కడ కనిపించింది.

ఇవి కూడా చదవండి

తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో కార్తీక్ తల్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. వేడుకలో కరణ్ జోహర్ మాట్లాడుతూ.. మీకు ఎలాంటి కోడలు కావాలి అని ప్రశ్నించగా.. డాక్టర్ కోడలు కావాలంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నారంటూ వచ్చే వార్తలకు మరింత బలం చేకూరింది. ఎందుకంటే అటు శ్రీలీల సైతం డాక్టర్ కోర్సు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం మరింత ఊపందుకుంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్