Bollywood: బుర్రపాడు సినిమా రా బాబూ.. ఇండస్ట్రీలోనే చెత్త మూవీ.. ఇప్పుడు ఓటీటీలో..
బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత పరమ చెత్త సినిమా అంటూ అడియన్స్ విమర్శలు గుప్పించారు. హారర్ కామెడీ డ్రామాగా థియేటర్లలో విడుదలై అతిపెద్ద డిజాస్టర్ అయిన సినిమా గురించి మీకు తెలుసా.. ? ఆ మూవీ విడుదలై దాదాపు 5 ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు.

దాదాపు 5 ఏళ్ల క్రితం విడుదలైన ఒక సినిమా ప్రేక్షకులకు నోట మాట రాకుండా చేసింది. థియేటర్లలోనే కాదు.. అటు ఓటీటీలోనూ ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ అడియన్స్ హైప్ అందుకోలేకపోయింది. ఈ చిత్రానికి IMDb లో పేలవమైన రేటింగ్ వచ్చింది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో హారర్ కామెడీ సినిమాలు వచ్చాయి. స్త్రీ, స్త్రీ 2, ముంజ్యా, భూల్ భూలయ్యా 3 వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఈ హారర్ కామెడీ సినిమాను చూసి తమను మోసం చేశారంటూ అడియన్స్ వాపోయారు. ఆ సినిమా పేరు లక్ష్మీ. 2020లో హిందీలో విడుదలైన ఈ సినిమా ఇది. ఇందులో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమాలో శరద్ కేల్కర్, అశ్విని కల్సేకర్, మను రిషి చద్దా, రాజేష్ శర్మ కీలకపాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఆసిఫ్ పాత్రను పోషించాడు. అతను హిందూ అమ్మాయి రష్మి (కియారా అద్వానీ)ని వివాహం చేసుకుంటాడు. అతను దయ్యాలను నమ్మడు, కానీ గాడిద ఆత్మ అతని శరీరాన్ని ఆక్రమిస్తుంది, ఆపై అసలు కథ ప్రారంభమవుతుంది. కానీ ప్రేక్షకులకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ నటించిన ‘లక్ష్మి’ చిత్రం 2020 లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పుడు కోవిడ్ మహమ్మారి కారణంగా నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. జియో హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రాఘవ్ లారెన్స్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన మొదటి హిందీ చిత్రం ఇది.
నిజానికి, అక్షయ్ కుమార్ చిత్రం ‘లక్ష్మి’ తమిళ చిత్రం ‘కాంచన’ హిందీ రీమేక్. దక్షిణాదిలో సూపర్ హిట్ అయిన సినిమాకు హిందీలో మాత్రం ఊహించని రెస్పాన్స్ వచ్చింది. హిందీ చిత్రం ‘లక్ష్మి’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. IMDB ప్రకారం, ‘లక్ష్మి’ సినిమా బాలీవుడ్ చెత్త చిత్రాల జాబితాలో చేర్చబడిందట.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..