Tollywood: అయ్య బాబోయ్.. ఆ హీరోతో రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. అదే హీరోతో..
సినీరంగంలో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కట్టిపడేసి తమకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అందులో ఈ వయ్యారి ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా నెట్టింట ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయిన అంతకు మించి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఫస్ట్ మూవీతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది. ఇంకేముంది ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ బ్యూటీగా మారింది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగులో తన మొదటి సినిమా చేస్తుంది. కానీ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతో నెట్టింట నిలుస్తుంటుంది. కాలేజీలో బాడీ షేమింగ్స్ కామెంట్స్ ఎదుర్కోన్నానని తెలిపింది. ఇటీవలే ఆమె ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని.. వీరిద్దరు చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. కానీ తామిద్దరం మంచి స్నేహితులము మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండరు. వయ్యరాలతో నెట్టింట మాయ చేస్తుంది. ఆ అమ్మడు మరెవరో కాదు.. హీరోయిన్ దివ్య భారతి.
ప్రస్తుతం కన్నడలో సెన్సేషనల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న దివ్య భారతి. బ్యాచిలర్ అనే సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ హీరోగా నటించాడు. ఫస్ట్ మూవీతోనే రొమాంటిక్ బోల్డ్ సీన్లతో రెచ్చిపోయింది దివ్యభారతి.తొలి చిత్రంతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో రొమాంటిక్, లిప్ లాక్ సీన్లతో షాకిచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన గోట్ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, దివ్య భారతి ప్రేమలో ఉన్నారంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ ను ఇద్దరూ ఖండించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది దివ్య భారతి. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..