Harihara Veeramallu : పవన్ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు.. హరిహర వీరమల్లు కోసం..
క్రిష్ దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయ్యింది కానీ కరోనా కారణంగా షూటింగ్ లెట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హరిహర వీర మల్లు. ఇటీవలే భీమ్లానాయక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న పవన్ ఇప్పుడు ఈ భారీ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రిష్ దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయ్యింది కానీ కరోనా కారణంగా షూటింగ్ లెట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణం. ఇక ఇప్పుడు పవన్ ఈ సినిమాను వీలైంత స్పీడ్ గా కంప్లీట్ చేయాలనీ చూస్తున్నారు. మొహాలయిలు కాలం నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా కోసం పవన్ కర్రసాము ప్రాక్టీస్ చేస్తోన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా లో ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడిని తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రకోసం బాబీ డియోల్ ను ఎంపిక చేశారు. ఈయన ఇటీవల వచ్చిన ఆశ్రమం అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పవన్ కెరీర్ లో అతంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైనప్ చేశారు పవర్ స్టార్. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా స్టోరీ డవలప్ చేసే పనిలో ఉన్నారు హరీష్. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..