Trisha: అందమే కాదు ఆఫర్ల విషయంలో కూడా తగ్గేదేలే అంటోన్న చెన్నై చిన్నది.. త్రిషకు భారీ ఆఫర్లు..

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 23 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికే తరగని అందంతో దూసుకుపోతోంది చెన్నై చిన్నది త్రిష. కేవలం 10 ఏళ్లలోనే హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి ఫేడ్‌ అయ్యే రోజుల్లో ఏకంగా 23 ఏళ్లు నిలదొక్కుకోవడం త్రిషాకే దక్కిందని చెప్పాలి. అయితే ఆ మధ్య సరైన విజయాలు...

Trisha: అందమే కాదు ఆఫర్ల విషయంలో కూడా తగ్గేదేలే అంటోన్న చెన్నై చిన్నది.. త్రిషకు భారీ ఆఫర్లు..
నెక్స్ట్ ఇయ‌ర్‌ త్రిష‌కు మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ ప‌క్క‌న న‌టించే రామ్ విడుద‌ల‌వుతుంది. త‌మిళంలో పొన్నియిన్ సెల్వ‌న్‌, విజ‌య్‌మూవీతో పాటు గ‌ర్జ‌నై, చ‌తురంగ వేట్టై, రాంగీ సినిమాలు రిలీజ్ అవుతాయి. త‌న రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణాన్ని ప్ర‌స్తావిస్తూ త‌న అభిమానుల‌ను త్రిష‌య‌ర్స్ అని త్రిష పిలిచిన తీరుకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 29, 2022 | 3:15 PM

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 23 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికే తరగని అందంతో దూసుకుపోతోంది చెన్నై చిన్నది త్రిష. కేవలం 10 ఏళ్లలోనే హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి ఫేడ్‌ అయ్యే రోజుల్లో ఏకంగా 23 ఏళ్లు నిలదొక్కుకోవడం త్రిషాకే దక్కిందని చెప్పాలి. అయితే ఆ మధ్య సరైన విజయాలు అందక కాస్త జోరు తగ్గిన త్రిష, పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో ఒక్కసారిగా కమ్‌బ్యాక్‌ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్‌ చిత్రం త్రిష కెరీర్‌ను మరోసారి మలుపు తిప్పింది. కుందవై యువరాణి పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించి మరోసారి తనదైన మార్క్‌ మ్యాజిక్‌ చేసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విజయంతో త్రిష మళ్లీ ఒక్కసారిగా ట్రాక్‌లోకి ఎక్కింది. తాజాగా ఈ బ్యూటీకి ఏకంగా రెండు భారీ అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు దళపతి విజయ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే గిల్లీ అనే సూపర్‌ హిట్‌ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్‌ 67వ చిత్రంలో త్రిషను హీరోయిన్‌గా తీసుకోనున్నారని టాక్‌. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను ఓకే చేశారని సమాచారం.

ఇదిలా ఉంటే కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ చిత్రంలోనూ త్రిష నటించే ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. అజిత్‌ 62వ చిత్రంలో త్రిషను తీసుకోవడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కెరీర్‌ ఇక ముగుస్తుందనుకుంటున్న సమయంలో త్రిషకు ఇలాంటి భారీ అవకాశాలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఈ రెండు చిత్రాలతో త్రిష కెరీర్‌ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..