RRR: ఏ ఇండియన్‌ మూవీ సాధించని ఘనతలు ట్రిపులార్‌ సొంతం.. అంతర్జాతీయంగా మరో అరుదైన గుర్తింపు..

భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టెక్కించింది ట్రిపులార్‌ చిత్రం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల అద్భుత నటన, రాజమౌళి మార్క్‌ దర్శకత్వం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. ఒక్క ఇండియాలోనే..

RRR: ఏ ఇండియన్‌ మూవీ సాధించని ఘనతలు ట్రిపులార్‌ సొంతం.. అంతర్జాతీయంగా మరో అరుదైన గుర్తింపు..
Rrr Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 29, 2022 | 2:47 PM

భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టెక్కించింది ట్రిపులార్‌ చిత్రం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల అద్భుత నటన, రాజమౌళి మార్క్‌ దర్శకత్వం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టింది. ఏకంగా రూ. వెయ్యి కోట్ల కలెక్షన్‌లను రాబట్టి తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రేక్షకులు నీరాజనం పలికిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రంశసలతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.

దేశీయ భాషలకే పరిమితం కాకుండా జపాన్‌ భాషలోనూ విడుదలై అక్కడి ప్రేక్షకులకు సైతం ఆకట్టుకుందీ సినిమా. ఇప్పటికే ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. ఇటీవలే ఈ సినిమాకి హాలీవుడ్‌కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమాగా అవార్డు దక్కింది. ఇలా ఏ భారతీయ సినిమాకు దక్కని గుర్తింపును సంపాదించుకున్న ట్రిపులార్‌ చిత్రం తాజగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సినిమా మ్యాగజైన్ ఎంపైర్‌ ఇటీవల రాజమౌళిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూను సదరు మ్యాగజైన్‌లో ప్రత్యేక ఆర్టికల్‌గా ప్రచురించారు. ఇలా ఈ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్న అతి కొద్ది సినిమాల జాబితాలో ఒకటిగా ట్రిపులార్‌ అరుదైన గుర్తింపును సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక అల్లూరి సీతరామరాజు, కొమురం భీమ్‌ల నిజ జీవిత కథలకు ఫిక్షన్‌ను జోడించి ట్రిపులార్‌ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి పాత్రలో రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీర్‌ అద్భుత నటనను కనబరిచారు. చరిత్రలో ఎంతో ప్రాధాన్యత సంపాదించుకున్న ఈ ఇద్దరు ఒకవేళ నిజంగా కలిసి ఉంటే ఏం జరుగుతుందన్న ఊహజనిత ఆలోచనకు కార్యరూపంగా వచ్చిన ట్రిపులార్‌ సినిమా భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..