Ram Setu Bridge: రామ సేతు మిస్టరీపై మళ్లీ మొదలైన చర్చ.. శ్రీరాముడు నిర్మించినదేనా?

రాళ్లు వేరే చోటు నుంచి తీసుకొచ్చి పేర్చినట్టుగా ఉన్నాయన్న పురాతత్వ శాఖ డాక్టర్ అలెన్ లెస్టర్. రామసేతు ఇసుక 4వేల ఏళ్ల నాటిదని , రాళ్లు 7 వేల ఏళ్ల నాటివని పరిశోధనలలో తేలిందని చెప్పారు. దీనిని సూపర్ హ్యూమన్ అచీవ్‌మెంట్ గా పేర్కొన్నసైన్స్ ఛానెల్.

Ram Setu Bridge: రామ సేతు మిస్టరీపై మళ్లీ మొదలైన చర్చ.. శ్రీరాముడు నిర్మించినదేనా?
Ram Setu Bridge
Follow us
Surya Kala

|

Updated on: Oct 29, 2022 | 2:12 PM

దేవుడు ఉన్నాడు లేడు అనే విషయంపై ఎప్పుడూ ఆస్థికులకు, నాస్తికులకు మధ్య వివాదం నడుస్తూనే ఉంటుంది. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలపై, రాముడు కృష్ణుడు దేవుళ్ళపై  ఎప్పుడు ఏదొక విషయంలో చర్చ నడుస్తూనే ఉంటుంది. లంకలో ఉన్న తన భార్య సీత ను రక్షించుకోవడం కోసం సముద్రం మీద రాముడు వారధి నిర్మించాడని.. దీనిని రామ సేతు అంటరాని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం రామ సేతు బాలీవుడ్ సినిమా నేపథ్యంలో మళ్ళీ వారధి నిర్మాణం రచ్చ మొదలైంది. రామసేతు శాశ్వతమైన ప్రేమకు వారధి అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన రామ సేతు సినిమా ఇటీవల విడుదలైంది. ఇందులో నాస్తికుడైన ఆర్కయాలజిస్ట్ రా అక్షయ్ నటించారు. రామ సేతు నిర్మాణం.. మూలాల గురించి అన్వేషించడం ఈ సినిమా నేపధ్యం.. తెరకెక్కిన సినిమా రామ సేతు. దీంతో ఇప్పుడు మళ్ళీ ఈ వారధిపై పరిశోధన చేసిన పురాతత్వ శాఖ  గురించి మళ్ళీ చర్చ మొదలైంది.

రామ సేతు బ్రిడ్జి పై పరిశోధన చేసిన పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. రామ సేతు సహజసిద్ధంగా ఏర్పడలేదని.. రాళ్లు వేరే చోటు నుంచి తీసుకొచ్చి పేర్చినట్టుగా ఉన్నాయన్న అలెన్ లెస్టర్ చెప్పారు. అంతేకాదు రామసేతు ఇసుక 4వేల ఏళ్ల నాటిదని, రాళ్లు 7 వేల ఏళ్ల నాటివని పరిశోధనలలో తేలిందని చెప్పారు. అంతేకాదు ఈ వారధి పై డాక్యుమెంటరీని చిత్రీకరించిన ఓ సైన్స్ ఛానల్.. ఇది సూపర్ హ్యూమన్ అచీవ్‌మెంట్ గా పేర్కొన్నది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఇది మానవుల మేధస్సుకు గొప్పనిదర్శనం అని చెప్పింది సదరు ఛానల్. మరికొందరు శాస్త్రవేత్తలు ఈ వారధి వయసు కొన్ని లక్షల సంవత్సరాలు ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఈ రాళ్లను ఎవరు వంతెనగా ఏర్పాటు చేశారు.. అసలు నీటి మీద రాళ్లు ఎలా తేలాయి వంటి అనేక సందేహాలకు సమాధానం మాత్రం ఇప్పటికీ మిస్టరీనే .. ప్రశ్నలు చాలా ఉన్నాయి.. కానీ సమాధానం దానికి స్పష్టమైన అధరాలు లేవు. అయితే కొన్ని సార్లు నదిలో రాళ్ళూ తేలుతూ.. వెళ్తున్నారని.. అవి రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లే అంటూ కొందరు చెబుతుంటారు.

రామసేతు వారథి గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు: 

  1. *రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ, ప్లాన్ ను నలుడు అందించారు.
  2. *నలుడనే వానరుని నేతృత్వంగా కోటిమంది వానరులు అయిదే అయిదు రోజుల్లో లంకకు వారధిని నిర్మించారని రామాయణంలో స్పష్టంగా పేర్కొన్నారు.
  3. *రామసేతు వంతెన తమిళనాడులో రామేశ్వరం వద్ద గల ధనుష్ కోటి నుండి శ్రీలంక లో గల మన్నర్ ద్వీపాలు వరకు 48 km పొడవు 3km వెడల్పు తో నిర్మించారు. చరిత్రలో ఈ వారధిన్ని ‘సేతుబంధ రామేశ్వరం’ అని పిలిచేవారు.
  4. *15 వ శతాబ్దం వరకు ఈ రామసేతు భారత్ నుండి శ్రీలంక వరకు నడక మార్గం కి అందుబాటులో ఉండేది.  10వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన అరబ్‌ యాత్రికులు సైతం ఇక్కడ ఒక వారధి ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు.
  5. *1480లో వచ్చిన పెను తుఫాను ప్రభావంతో ఈ వంతెన ధ్వంసమైంది. అనంతరం ఈ రామసేతు గురించి చరిత్రకారులు మర్చిపోయారు.
  6. * 2002లో నాసా అంతరిక్షం నుంచి తీసిన ఒక చిత్రంలో రామసేతు స్పష్టంగా కనిపించడంతో ఈ వంతెన గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఈ వారధి గురించి శాస్త్రీయ కారణాలను వెతికే ప్రయత్నం చేశారు.
  7. *రామసేతు దగ్గర కనిపంచే రాళ్లు లావాతో ఏర్పడే ప్యూమిస్‌ రాళ్లని, అందుకే అవి నీటిలో తేలుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు వాదించారు.
  8. *ప్యూమిస్‌ రాళ్లు కొద్దిసేపు మాత్రమే నీటిలో తేలతాయనీ.. ఇవి రాముని మహిమతోనే వేల ఏళ్లు నీటిపై తేలుతున్నాయన్నది భక్తుల వాదన. పైగా ఈ రాళ్లను కార్బన్ డేటింగ్‌తో పరీక్షించినప్పుడు అవి కొన్ని లక్షల ఏళ్ల క్రితం రాళ్లు అని తేలింది.
  9. * శ్రీలంక ప్రభుత్వం కూడా ఇది రాముడు నిర్మించిన వారధే అని ప్రచారం చేస్తోంది. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ వారధి ఇప్పటికీ చాలావరకు సముద్రం మీద తేలుతూ కనిపిస్తుంటుంది.

( సేకరణ)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..