Prabhas: రెబల్ స్టార్ ఫ్యాన్సా మజాకా.. దెబ్బకు బాబుకు జ్ఞానోదయం అయ్యింది.. ఇక పై అందరిని ప్రేమిస్తానంటూ..

'కల్కి 2898 AD' సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, 'ప్రభాస్' పాత్ర జోకర్ లాగా ఉంది' అని అన్నాడు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మనోడికి చుక్కలు చూపించారు.

Prabhas: రెబల్ స్టార్ ఫ్యాన్సా మజాకా.. దెబ్బకు బాబుకు జ్ఞానోదయం అయ్యింది.. ఇక పై అందరిని ప్రేమిస్తానంటూ..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 22, 2024 | 7:06 PM

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ .. ఈ మధ్య మనోడి పేరు తెగ వినిపిస్తుంది. మన రెబల్ స్టార్ ప్రభాస్ పై కామెంట్స్ చేసి వివాదం లో చిక్కుకున్నాడు ఇతగాడు. కొన్ని వారాల క్రితం తనను అనవసరంగా ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసి ఫ్యాన్స్ కోపానికి బలయ్యాడు. ‘కల్కి 2898 AD’ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ‘ప్రభాస్’ పాత్ర జోకర్ లాగా ఉంది’ అని అన్నాడు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మనోడికి చుక్కలు చూపించారు. ట్రోల్స్ తో బాలీవుడ్ ను షేక్ చేశారు. అర్షద్ వార్సీ కామెంట్స్ తర్వాత బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా చర్చకు కారణమైంది. ఇప్పుడు ఆ ఘటనలపై అర్షద్ వార్సీ మరోసారి స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి మాట్లాడాడు.

Mathu Vadalara 2: రియా దొరికేసిందిరోయ్..! మత్తువదలరా 2 భామ మాములుగా లేదుగా..

‘ప్రతి ఒక్కరికీ వారి వారి దృక్కోణం ఉంటుంది. మనది ప్రజాస్వామ్య దేశం. మాట్లాడే హక్కు అందరికీ ఉంది. మీరు సానుకూల వ్యక్తి అయితే, ఏదైనా ప్రతికూల ఆలోచన మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు నేను దాని గురించి పట్టించుకోను అని అర్షద్ వార్సీ చెప్పాడు.

ఇది కూడా చదవండి : Devara : ఇదెక్కడి మాస్ రా మావ.! దేవరలో నటించిన ఈమె బయట దుమ్మురేపుతోందిగా..!

ప్రభాస్ పాత్రను జోకర్ లా ఉంది కానీ కామెంట్స్ చేసిన తర్వాత ప్రజలు అర్షద్ వార్సీని ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో అర్షద్ వార్సీ తన సోషల్ మీడియా ఖాతాలో కామెంట్ ఆప్షన్‌ను ఆఫ్ చేశాడు. దాని గురించి అడిగితే, ‘ఎలా చేయాలో నాకు తెలియదు’ అని ఫన్నీగా చెప్పాడు. అలాగే ఇన్ని వివాదాల తర్వాత ఏ నటుడి గురించి మాట్లాడే సమయంలో అర్షద్ వార్సీ జాగ్రత్తగా ఉంటాడా? ఈ ప్రశ్నకు ఆయన వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ‘తప్పకుండా జాగ్రత్తగా ఉంటాను. నేను చూసే ప్రతి సినిమాని నేను ఇష్టపడతాను మరియు నా జీవితాంతం అందరు నటీనటులను ప్రేమించాలని నిర్ణయించుకున్నాను’ అని అర్షద్ వార్సీ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.