- Telugu News Photo Gallery Cinema photos Will Allu Arjun Pushpa 2 box office collections cross KGF 2 and Baahubali 2
Pushpa 2: ఆ సినిమాల సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న పుష్ప.. బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందా ??
ఏడు సంవత్సరాల క్రితం బాహుబలి 2.. రెండు సంవత్సరాల క్రితం కేజియఫ్ 2 ప్రస్తుతం పుష్ప 2.. మూడు సినిమాలకు ఒకే సెంటిమెంట్ పని చేస్తుంది. అసలు కంటే కొసరు ఎక్కువ అంటుంటారు కదా..? పుష్ప 2 విషయంలోనూ ఇదే జరుగుతుంది. మరి అప్పుడు బాహుబలి 2, కేజియఫ్ 2 చేసిన మ్యాజిక్ ఇప్పుడు పుష్ప 2 చేస్తుందా..? ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి..? మ్యాజిక్ ఏంటి..? ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Oct 22, 2024 | 6:17 PM

అన్ని ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టడం పక్కా అంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ముఖ్యంగా కన్నడలో కేజీఎఫ్ ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అంతకు మించి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించిన కన్నడ డిస్ట్రిబ్యూటర్స్, వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయన్నారు.

బాలీవుడ్‌లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఏ రికార్డు అసాధ్యమని చెప్పలేం..! క్రిస్మస్‌కు బేబీ జాన్ తప్పిస్తే.. అక్కడ చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. దాంతో న్యూ ఇయర్ వరకు పుష్ప దూకుడు ఖాయం.

ఆ తర్వాత ఐదేళ్ళకు 2022లో ట్రిపుల్ ఆర్‌తో రెండోసారి.. 2024లో కల్కితో మూడోసారి.. తాజాగా పుష్ప 2తో నాలుగోసారి తెలుగు సినిమాలకు 1000 కోట్లు వచ్చాయి.

అది కూడా ఎక్కువగా బీ సీ సెంటర్ల మీదే దృష్టి పెడుతున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ కాబట్టి మాస్ ఆడియన్సే మెయిన్ ఎసెట్ అని భావిస్తున్నారు.

తొలి భాగం నార్త్‌లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద కూడా బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు పుష్ప 2 మేకర్స్.





























