- Telugu News Photo Gallery Cinema photos Prabhas Sister Praseedha Shares Childhood Photos with Her Brother Birthday Special
Prabhas : చెల్లెళ్లతో ప్రభాస్.. అన్నయ్యతో చిన్నప్పటి ఫోటోస్ షేర్ చేసిన ప్రసీదా..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ చెల్లెలు ప్రసీదా షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Updated on: Oct 23, 2024 | 11:39 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో సినీ ప్రమఖులు, సెలబ్రెటీస్ చాలా మంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ చెల్లెలు ప్రసీద కూడా స్పెషల్ విషెస్ చెప్తూ చిన్నప్పటి ఫోటోస్ షేర్ చేసింది.

స్పెషల్ ఫోటోలతోపాటు చిన్నప్పుడు అన్నయ్యతో దిగిన ఫోటోస్ షేర్ చేస్తూ ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పింది. దివంగత హీరో కృష్ణంరాజుకు నలుగురు కూతుళ్లు అన్న సంగతి తెలిసిందే. ఈ నలుగురికి ప్రభాస్ అన్నయ్య.

చెల్లెళ్లతో ప్రభాస్ ఎంతో సరదాగా ఉంటాడు. వీరందరికి అన్నయ్య అంటే ఎంతో ఇష్టం. నలుగురు చెల్లెళ్లోల ప్రసీద ఇప్పటికే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది. తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది.

అలాగే ప్రభాస్ సినిమా ఈవెంట్లలోనూ పాల్గొంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలికీ సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటుంది. నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో చాలా ఫోటోలు షేర్ చేసి అన్నయ్యకు విషెస్ చెప్పింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజాసాబ్, డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చిత్రీకరణ జరుగుతుండగా.. మరికొన్ని సినిమాలు స్టార్ట్ కానున్నాయి.




