- Telugu News Photo Gallery Cinema photos A news is going viral that Prabhas is acting in Pawan Kalyan's OG movie
Pawan Kalyan-Prabhas: పవర్‌స్టార్ సినిమాలో రెబెల్ స్టార్..! ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రభాస్ ఓ పాత్రలో కనిపిస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది వింటేనే గూస్బంప్స్ వస్తున్నాయి కదా.. ఇదే నిజమైతే ఇంకా ఇద్దరి అభిమానులకు పూనకాలే. అయితే ఆ సినిమా ఏంటో.? ఇది ఎంతవరకు.? అన్న విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం..
Updated on: Oct 23, 2024 | 12:21 PM

ఇప్పటికే సోషల్ మీడియాలో డార్లింగ్‌కి ఫ్యానిజం చేస్తున్న పవర్ స్టార్ డివోటీస్. ఇందులో భాగంగానే ప్రభాస్ కల్కి సినిమా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు పవన్ అభిమానులు. ఇది అంత ఓజికి తిరిగి ఇచ్చేద్దాం అంటున్నారు ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్. అదే ఇద్దరు కలిసి నటిస్తే.. ఆ సినిమా మరి ఈ రేంజ్ లో ఉంటుండో ఊహిస్తేనే గూస్బంప్స్ వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ సినిమా మరేదో కాదు సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజి. ఇందులో సిద్ధాంత్ నందన్ సాహోగా ప్రభాస్ మరోసారి కనిపించనున్నారని వార్త వైరల్ అవుతుంది.

ఇది సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అని, ఓజి సినిమాలో పవన్ పాత్రకి సాహూ (ప్రభాస్) స్నేహితుడని ఇంకా మరెన్నో వార్తలు వైరల్ అవుతుంది. దీంతో పాటు గతంలో డార్లింగ్ కూడా ఓ ఇంటర్వ్యూలో సాహూ పార్ట్ 2 ఉండొచ్చు అని కూడా చెప్పారు.

ఈ న్యూస్ కూడా జోడిస్తూ ఇది సుజీత్ ప్లాన్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ గురించి డార్లింగ్ ముందు హింట్ ఇచ్చారు అంటూ వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై ఓజి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోడడంతో ఈ కాంబో పక్క అంటున్నారు కొంతమంది నెటిజనులు. మరి ఏమి జరుగుతుందో.?చుడాలిక..

ఇదిలా ఉంటె ఇటీవల ఈ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయింది. త్వరలో పవర్ స్టార్ కూడా సెట్స్‌లో జాయిన్ కానున్నారు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో కథానాయక.




