- Telugu News Photo Gallery Cinema photos Heroine Pragya Jaiswal latest sizzling photos goes viral in social media
Pragya Jaiswal: అందంలో వెన్నెలకి.. సొగసులో మధనుడి భార్యకి పోటీ ఇస్తున్న ప్రగ్య..
ప్రగ్యా జైస్వాల్ మోడల్ గా, నటిగా బాగా ఫేమస్. ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాలలో ఎక్కువగా నటిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన, నాటకాల పట్ల మక్కువ ఎక్కువ. తెలుగు కంచె, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, అఖండ, వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది. తెలుగు తన నటనకి అవార్డులు కూడా అందుకుంది. తాజాగా ఆమె షేర్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Updated on: Oct 23, 2024 | 1:02 PM

12 జనవరి 1988న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ లో జన్మించింది ప్రగ్య జైస్వాల్. ప్రంజూల్ జైస్వాల్ అనే సోదరి కూడా ఈమెకు ఉంది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.

సింబయాసిస్ యూనివర్శిటీలో చదువుతున్న సమయంలో ఆమె వివిధ అందాల పోటీల్లో పాల్గొని విజయవంతమైన మోడల్‌గా మారింది. 2014లో కళ మరియు సాంస్కృతిక రంగంలో ఆమె సాధించిన విజయానికి సహజీవన సాంస్కృతిక పురస్కారాన్ని అందుకుంది.

2008లో ఆమె ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది. అందాల పోటీ ఫెమినా మిస్ ఇండియా 2008 ద్వారా మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డ్యాన్సింగ్ క్వీన్ మరియు మిస్ ఫ్రెండ్ ఎర్త్ టైటిల్‌లను గెలుచుకుంది.

కంచె చిత్రానికి 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్, 5వ SIIMA ఉత్తమ మహిళా అరంగేట్రం (తెలుగు), సినీమా అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ, 18వ ఉగాది పురస్కారాలు ఉత్తమ మహిళా అరంగేట్రం, జీ తెలుగు అప్సర అవార్డులు, TSR – TV9 జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఉత్తమ తొలి నటి అవార్డులు ఉందుకుంది.

2015లో మిర్చి లాంటి కుర్రాడు చిత్రంతో తెలుగు డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ... అదే ఏడాది వచ్చిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగు ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా, అఖండ, సన్ అఫ్ ఇండియా చిత్రాల్లో నటించింది.




