- Telugu News Photo Gallery Cinema photos Actress Khushboo's daughter avantika Latest Photos Goes Viral, She is look like heroine
Kushboo : ఏంటీ ఈమె ఖుష్బూ కూతురా.? అందంలో తల్లిని మించిపోయిందిగా.. చూస్తే మెంటలెక్కాల్సిందే
ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ ఖుష్బూ ఫోటోస్ వైరలవుతున్నాయి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటి ఖుష్బూకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే కూతురు ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖుష్బూ పెద్ద కూతురు లండన్ లో చదువు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
Updated on: Oct 23, 2024 | 1:17 PM

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఖుష్భూ. 90వ దశకంలో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. అప్పట్లో ఆమె అందం, అభినయానికి ముగ్దులవ్వని అభిమానులు లేరనే చెప్పుకోవాలి. ఏకంగా ఆమెకు గుడి కట్టి ఆరాధించారు ఫ్యాన్స్.

తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన ఖుష్బూ.. ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. తాజాగా ఆమె కూతురి ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

1991లో నటుడు ప్రభును ప్రేమ వివాహం చేసుకుంది ఖుష్బూ. కానీ అప్పటికే ప్రభుకు పెళ్లి కావడంతో వీరి వివాహాన్ని ఆయన తండ్రి, భార్య అంగీకరించలేదు. దీంతో పెళ్లైన మూడు నెలలకే వీరిద్దరు విడిపోయారు.

ఆ తర్వాత సినిమాలతో బిజీగా ఉన్న ఖుష్బూ.. అదే సమయంలో డైరెక్టర్ సుందర్ సి ని 2000లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు అవంతిక, అనందిత ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ నెట్టింట యాక్టివ్.

ఇదిలా ఉంటే..లండన్ లో చదువుతున్న ఖుష్బూ పెద్ద కూతురు అవంతిక తాజాగా కొన్ని ఫోటోస్ షేర్ చేయగా.. అవి కాస్త నెట్టింట వైరలవుతున్నాయి. అందులో ఆమె గ్లామర్ లుక్తో.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే అన్న రేంజ్ లో కనిపిస్తుంది.




