AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam: యుద్ధం ఆమెకు ప్రాణం పోసింది.. గూస్‏బంప్స్ తెప్పిస్తోన్న ‘బర్త్ ఆఫ్ వెన్నెల’ వీడియో.. మీరు చూశారా ?

ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది..నేను వెన్నెల... ఇది నా కథ అంటూ

Virata Parvam: యుద్ధం ఆమెకు ప్రాణం పోసింది.. గూస్‏బంప్స్ తెప్పిస్తోన్న 'బర్త్ ఆఫ్ వెన్నెల' వీడియో.. మీరు చూశారా ?
Birth Of Vennela Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 16, 2022 | 8:38 AM

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి వీడియో.. ట్రైలర్.. సాంగ్స్ ఇలా ఒక్కటేమిటీ ప్రతి అప్డేట్ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. రోజు రోజుకీ విరాటపర్వం మూవీ క్రేజ్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇందులో సాయి పల్లవి, రానా దగ్గుబాటి కలిసి నటిస్తుండడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకుల ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. 90’sలో జరిగిన వాస్తవ ఘటనలు.. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సంక్షోభంతో పలుమార్లు వాయిదా పడినప్పటికీ చివరకు జూన్ 17న థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు మేకర్స్. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్ లో విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ వేడుకలో రిలీజ్ చేసిన బర్త్ ఆఫ్ వెన్నెల వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

విరాట పర్వం సినిమాలో ప్రధాన పాత్ర అయిన వెన్నెల పుట్టుకకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. నాలుగు నిమిషాల నిడివి ఉన్న వీడియో సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.. ఆ వీడియోలో ” కారణం ఎప్పుడూ ఉంటుంది.. కానీ అది ఎల్లప్పుడూ సహేతుకం కాదు” అంటూ కారల్ మార్క్స్ కొటేషన్ తో ప్రారంభమైన ఈ వీడియోలో.. 1973 తెలంగాణ రూరల్, ఆంధ్రప్రదేశ్ సమీపంలోని అడవి.. రాత్రి భారీ వర్షంలో ఓ ట్రాక్టర్ లో ఓ గర్భిణీ పురిటినొప్పులతో ఇబ్బందిపడుతుంది. అదే సమయంలో నక్సల్స్ కు.. పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతుంటాయి. దీంతో ట్రాక్టర్ రోడ్డుపైనే ఆపేస్తాడు డ్రైవర్.. గర్భిణి అరుపులు విన్న నక్సలైట్ నివేధా పేతురాజ్ ప్రాణాలకు తెగించి ఆమెను చేరుకుంటుంది.. నేను డాక్టర్‏ను అని చెప్పి ఆ గర్భిణికి ప్రసవం చేస్తుంది. ఆ తర్వాత పండంటి ఆడపిల్లను చేతుల్లోకి తీసుకుని తన తండ్రికి ఇస్తుంది. తన కూతురిని, భార్యను కాపాడినందుకు తన బిడ్డకు ఆమెనే పేరు పెట్టాలని అడగ్గా.. చందమామను చూస్తూ ఆ పాపకు వెన్నెల అని పేరు పెడుతుంది. అనంతరం లాల్ సలామ్ అంటూ పిడికిలి బిగించగానే… ఆమె తలలోకి బుల్లెట్ దూసుకుపోయి అక్కడే కూప్పకూలిపోతుంది. ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది..నేను వెన్నెల… ఇది నా కథ అంటూ సాయి పల్లవి డైలాగ్‏తో ముగిసే ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా కుర్మాని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.. రెసిపీ
టమాటా కుర్మాని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.. రెసిపీ
కర్ణుడు గురించి కృష్ణుడు చెప్పిన సుగుణాలు ఇవే నేటి తరానికి స్పూర్
కర్ణుడు గురించి కృష్ణుడు చెప్పిన సుగుణాలు ఇవే నేటి తరానికి స్పూర్
వాట్సాప్‌లో తెలియని నంబర్ నుండి తరచుగా సందేశాలు వస్తున్నాయా?
వాట్సాప్‌లో తెలియని నంబర్ నుండి తరచుగా సందేశాలు వస్తున్నాయా?
ప్రీతి పాప హ్యాపీ.. చరిత్ర సృష్టించిన ప్రభ్‌సిమ్రన్ క్షణం!
ప్రీతి పాప హ్యాపీ.. చరిత్ర సృష్టించిన ప్రభ్‌సిమ్రన్ క్షణం!
7/G బృందావన్ కాలనీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో మీరే చూడండి
7/G బృందావన్ కాలనీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో మీరే చూడండి
ఈడీ అధికారులకు హీరో మహేష్ బాబు లేఖ.. విచారణకు ఎందుకు రాలేదంటే!
ఈడీ అధికారులకు హీరో మహేష్ బాబు లేఖ.. విచారణకు ఎందుకు రాలేదంటే!
మార్కెట్‌లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ టాటా కారు లాంచ్..!
మార్కెట్‌లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ టాటా కారు లాంచ్..!
ఒకప్పుడు పాన్ ఇండియా యాక్టర్.. ఇప్పుడు ఫ్యామిలీ కోసం వాచ్‏మెన్‏గా
ఒకప్పుడు పాన్ ఇండియా యాక్టర్.. ఇప్పుడు ఫ్యామిలీ కోసం వాచ్‏మెన్‏గా
ఇంట్లోని బీరువా కింద నుంచి కుప్పలు తెప్పులుగా...
ఇంట్లోని బీరువా కింద నుంచి కుప్పలు తెప్పులుగా...
ఇక అతి తక్కువ ఖర్చుతో గర్భాశయ క్యాన్సర్‌ నిర్ధారణ!
ఇక అతి తక్కువ ఖర్చుతో గర్భాశయ క్యాన్సర్‌ నిర్ధారణ!