Brahmastra Trailer: అద్భుతంగా బ్రహ్మాస్త్ర ట్రైలర్.. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయ్..

సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్ట్‏లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో మొదటి పార్ట్ శివ పేరుతో విడుదల చేయనున్నారు.

Brahmastra Trailer: అద్భుతంగా బ్రహ్మాస్త్ర ట్రైలర్..  విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయ్..
Brahmastra
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:11 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మస్త్ర (Brahmastra). స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్ట్‏లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో మొదటి పార్ట్ శివ పేరుతో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ , స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, మౌనీ రాయ్, నాగార్జున అక్కినేని కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీ పై మరింత ఆసక్తిని కలిగించాయి. ఇక ఇటీవల విడుదలైన నాగార్జున, మౌనీ రాయ్ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.. ఇక ఇప్పుడు ప్రేక్షకులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్న బ్రహ్మస్త్ర ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్..

నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి.. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది అంటూ చిరు చెప్పే వాయిస్‏తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. బ్రహ్మాస్త్రం విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుని ఉందన్న విషయం తెలియని యువకుడే శివ.. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రతి సీన్ విజువల్ వండర్ ఎఫెక్ట్‏గా కనిపిస్తోంది. ప్రేమ జంట.. బ్రహ్మాస్త్రాం కోసం పోరాటం.. దుష్టశక్తుల యుద్ధం.. ఇలా అన్నింటిని కలిపి ట్రైలర్ అద్భుతంగా ఉంది. అగ్ని నన్ను దహించలేదు అంటూ శివ, ఇషా మధ్య ప్రేమను చూపించారు..తాజాగా విడుదలైన ట్రైలర్‏లో సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.