AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ట్రోలర్స్‏కు షాకిచ్చిన ప్రభాస్.. మరింత స్టైలీష్ లుక్‏లో డార్లింగ్ లుక్ అదుర్స్.. వైరలవుతున్న వీడియో..

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.. రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్,

Prabhas: ట్రోలర్స్‏కు షాకిచ్చిన ప్రభాస్.. మరింత స్టైలీష్ లుక్‏లో డార్లింగ్ లుక్ అదుర్స్.. వైరలవుతున్న వీడియో..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2022 | 8:02 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏కు (Prabhas) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించుకున్న పాన్ ఇండియా స్టార్. బాహుబలి సినిమాతో డార్లింగ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు.. ప్రభాస్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాలన్ని పాన్ ఇండియావి కావడం విశేషం. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే గతంలో ప్రభాస్ లుక్స్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ప్రభాస్ లుక్ పై విపరీతమైన ట్రోలింగ్ చేశారు. ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ సమయంలో బయటకు వచ్చిన ప్రభాస్ ఫోటోస్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.. తాజాగా తన లుక్ పై ట్రోల్ చేసిన వారికి షాకిచ్చాడు యంగ్ రెబల్ స్టార్.. స్టైలీష్ లుక్ లో కనిపించి వావ్ అనిపించారు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.. రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్, సైఫ్ ఆలీ ఖాన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ మూవీ. ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్.. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తైయింది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో డైరెక్టర్ ఓంరౌత్ ఇంట్లో జరిగిన చిన్న పార్టీకి ప్రభాస్ విచ్చేశారు.. ఆదిపురుష్ టీం మొత్తం ఓంరౌత్ ఇంట్లో సందడి చేశారు.. అయితే ఓంరౌత్ ఇంట్లో నుంచి బయటకు వస్తూ మీడియా కంటికి చిక్కారు. దీంతో ఫోటోలకు ఫోజిలివ్వాలని విలేకర్లు అడగ్గా..ప్రభాస్ కాస్త మోహమాట పడుతూ కనిపించారు. అంతేకాదు..పూర్తిగా వెయిట్ లాస్ అయ్యి మరింత స్లిమ్ అండ్ స్టైలిష్ గా కనిపించి తన లుక్స్ తో అందరిని కట్టిపడేశాడు డార్లింగ్.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్ లేటేస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మళ్లీ మిర్చిలోని ప్రభాస్ ను చూసినట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సలార్, ఆదిపురుష్ మాత్రమే కాకుండా…ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ