AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ఈ కథ మరణాన్నే వణికించిన మహారాజుది.. బాలయ్య కొత్త సినిమా టీజర్ వచ్చేసింది..

నందమూరి హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబోలో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారని సమాచారం. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్.

Balakrishna: ఈ కథ మరణాన్నే వణికించిన మహారాజుది.. బాలయ్య కొత్త సినిమా టీజర్ వచ్చేసింది..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: Nov 15, 2024 | 11:33 AM

Share

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు 100 కోట్ల సినిమా కలెక్షన్లతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య.. ఈసారి మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. NBK109 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమా టైటిల్ చెప్పాలంటూ ఇప్పటికే ఫ్యాన్స్ ట్విట్టర్ లో నానా హంగామా చేశారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా నందమూరి అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది చిత్రయూనిట్. తాజాగా ఈ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేస్తూ టీజర్ విడుదల చేశారు మేకర్స్.

ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు రివీల్ చేస్తూ టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్. “ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు.. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు.. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది” అనే డైలాగ్స్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. “గుర్తుపట్టావా.. డాకు మహారాజ్” అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ హైలెట్ అయ్యాయి. దీంతో డాకు మహారాజ్ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

భగవంత్ కేసరి సినిమాతో హిట్టు అందుకున్న బాలయ్య.. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రానున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే మలయాళీ చిత్రపరిశ్రమకు చెందిన అగ్రకథానాయకుడు ఇందులో ముఖ్య పాత్ర పోషించనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజమౌళి 'వారణాసి'లో మరో స్టార్ యాక్టర్.. మహేష్ తండ్రి పాత్రలో..
రాజమౌళి 'వారణాసి'లో మరో స్టార్ యాక్టర్.. మహేష్ తండ్రి పాత్రలో..
2 రోజుల్లో CSIR UGC NET 2025 రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్
2 రోజుల్లో CSIR UGC NET 2025 రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్
కారు లుక్‌ మార్చాలని.. డబ్బుతో పాటు ఇంకా చాలా నష్టపోతారు!
కారు లుక్‌ మార్చాలని.. డబ్బుతో పాటు ఇంకా చాలా నష్టపోతారు!
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు..!
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు..!
శోభన్ బాబుపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శోభన్ బాబుపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
RRB NTPC 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు లింక్
RRB NTPC 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు లింక్
బ్యాంక్‌ నుంచి రూపాయ తీయడం లేదు .. ఐటీ శాఖకు డౌట్‌ వచ్చి..
బ్యాంక్‌ నుంచి రూపాయ తీయడం లేదు .. ఐటీ శాఖకు డౌట్‌ వచ్చి..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం కాబోతుంది..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం కాబోతుంది..
బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలు.. మీర్నా అదిరిపోయే ఫొటోస్
బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలు.. మీర్నా అదిరిపోయే ఫొటోస్
ఆ స్టార్ హీరోకు స్టోరీ చెప్పిన ముగ్గురు యంగ్ డైరెక్టర్లు
ఆ స్టార్ హీరోకు స్టోరీ చెప్పిన ముగ్గురు యంగ్ డైరెక్టర్లు