అబ్బో.! వరుణ్‏తో ఇంత క్లోజ్‏గా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా

'D ఫర్ దోపిడీ' సినిమా గుర్తుందా.? అదేనండీ.! ఈ సినిమాలో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్, నవీన్ పోలిశెట్టి హీరోలుగా నటించగా.. హేస్ట్ కామెడీ జోనర్‌లో ఇది తెరకెక్కింది.

అబ్బో.! వరుణ్‏తో ఇంత క్లోజ్‏గా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 15, 2024 | 12:30 PM

‘D ఫర్ దోపిడీ’ సినిమా గుర్తుందా.? అదేనండీ.! 2013లో విడుదలైన ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. నిర్మాతగా నానికి కూడా మంచి సక్సెస్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్, నవీన్ పోలిశెట్టి హీరోలుగా నటించగా.. హేస్ట్ కామెడీ జోనర్‌లో ఇది తెరకెక్కింది. ఇక ఇందులో హీరోయిన్‌గా హాలివుడ్ నటి మెలనీ చంద్ర నటించింది. ఆమెకిది టాలీవుడ్ తొలి చిత్రం. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. నటనకు మంచి మార్కులూ కొట్టేసింది. మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తోంది.? ఎలా ఉందో తెలుసుకుందామా..

ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

ఇవి కూడా చదవండి

మెలనీ చంద్ర మొదట తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించి.. ఆ తర్వాత ‘బైసికల్ బ్రైడ్’ అనే హాలివుడ్ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘లవ్ లైస్ అండ్ సీత’, ‘ఫర్ హియర్ ఆర్ టూ గో’, ‘ద్రౌపది అన్ లీష్ద్’, ‘హాట్ మెస్ హాలిడే’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చింది. ఇక 2013లో ఒకే ఒక్క తెలుగు చిత్రం ‘D ఫర్ దోపిడీ’లో కనిపించింది. బుల్లితెరపై కూడా ఈమె పలు టీవీ సిరీస్‌లు నటించింది. ‘హాస్పిటల్ ఫర్ హోప్’ అనే ఆస్పత్రికి కో-ఫౌండర్‌గా ఉన్న మెలనీ.. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. ప్రస్తుతం అమెరికాలోని ఇల్లినోయిస్‌లో నివసిస్తున్న ఈమెకు ఇద్దరు పిల్లలు. ఇక ఈమె భర్త నీరజ్ చంద్ర ఓ బిజినెస్ మెన్. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మీరూ వాటిపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి