Balakrishna : తండ్రికి తగ్గ తనయ.. మొదటిసారి కెమెరా ముందుకు బాలకృష్ణ కూతురు.. ఫస్ట్ యాడ్‌లోనే అదరగొట్టిన తేజస్విని..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. తాజాగా నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆమె మరెవరో కాదండి.. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. దివంగత హీరో నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ . మరోవైపు బాలకృష్ణ తనయుడు మోక్జజ్ఞ హీరోగా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నాడు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులను ఊహించని విధంగా ఆశ్చర్యపరిచారు బాలకృష్ణ చిన్నకూతురు నందమూరి తేజస్విని. ఇప్పటివరకు కెమెరా వెనుక ప్రొడక్షన్ ప్లానింగ్, ఫైనాన్స్, మార్కెంటింగ్ బాధ్యతలు చూసిన తేజస్విని ఇప్పుడు ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అరంగేట్రం చేశారు.
ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్, నందమూరి తేజస్వినిని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఇది నందమూరి కుటుంబానికి, తెలుగు సినిమా అభిమానులకు ఒక చిరస్మరణీయ సందర్భమని తెలియజేసింది. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్న తేజస్విని యాడ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఆ యాడ్ లో తేజస్విని పర్ఫార్మెన్స్, గ్లామర్, యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తేజస్విని హీరోయిన్ మెటిరియల్ అని.. మొదటిసారి పస్ట్ యాడ్ లోనే ఎంతో అందంగా నటించారంటూ తెగ పొగిడేస్తున్నారు.
ఈ యాడ్ కు వై. యమునా కిషోర్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ అందమైన నృత్య రీతులు సమకూర్చారు. ఈ బ్రాండ్ ప్రమోషనల్ వీడియో తేజస్విని అందాన్ని, సమతుల్యతను మరింత అందంగా చిత్రీకరించింది. ఎస్ఎస్ థమన్ ఆహ్లాదకరమైన సంగీత సంగీతం విజువల్స్‌కు మరింత వెలుగునిచ్చింది. ఆయంక బోస్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను దృశ్యపరంగా మంత్రముగ్ధులను చేసింది. అవినాష్ కొల్లా అద్భుతమైన కళా దర్శకత్వం, నవీన్ నూలి స్పష్టమైన ఎడిటింగ్ తుది కూర్పును మెరుగులు దిద్దాయి. డబూ రత్నాని ప్రముఖ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ప్రముఖ డిజైనర్ నాగిని ప్రసాద్ వేమూరి, శ్రీమణి మతుకుమిల్లి, శ్రీదుర్గా కాట్రగడ్డ ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు ఈ సిద్ధార్థ్ ఫైన్ జ్యువెల్లర్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. తాజాగా విలేకరుల సమావేశంలో శ్రీ వేమూరి కృష్ణ ప్రసాద్, సంస్థ తరపున మాట్లాడుతూ.. నందమూరి తేజస్వినితో బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి : Serial Actress: సూపర్ సూపరో.. సముద్రం మధ్యలో సీరియల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫోటోలతో కిక్కెంచిన అమూల్య..




