Balagam Venu: ‘బలగం’ డైరెక్టర్ వేణుకు బంపరాఫర్.. ఏకంగా బాలయ్యతో సినిమా ఛాన్స్!
ప్రస్తుతం బలగం సక్సెస్ జోష్‌లో ఉన్న వేణు తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అయితే తనకు డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్‌లోనే తన తర్వాతి సినిమా కూడా ఉంటుందని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో వేణు ఒకరు. అంతకుముందు చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించినా జబర్దస్త్‌తోనే జనాల్లో పాపులరయ్యాడు వేణు. అయితే హఠాత్తుగా ఈ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన అతను మెగా ఫోన్ పట్టుకున్నాడు. బలగం సినిమాను తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టేలా ఉన్న ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వేణు దర్శకత్వ ప్రతిభకు మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సైతం ముగ్ధులయ్యారు. మొదట థియేటర్లలో అదరగొట్టిన బలగం ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలంగాణలోని చాలా పల్లెల్లో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేసుకుని మరీ బలగం సినిమాను వీక్షించడం వేణు డైరెక్షన్ ట్యాలెంట్‌కు నిదర్శనం. ఇక అంతర్జాతీయంగానూ పలు అవార్డులు కొల్లగొట్టిందీ ఫీల్ గుడ్ మూవీ. ప్రస్తుతం బలగం సక్సెస్ జోష్‌లో ఉన్న వేణు తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అయితే తనకు డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్‌లోనే తన తర్వాతి సినిమా కూడా ఉంటుందని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే వేణు తన తర్వాతి ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే…
వేణు తన తర్వాతి ప్రాజెక్టును ఓ స్టార్ హీరోతో ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే బాలయ్య కోసం వేణు కథ కూడా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో సినిమా అంటే ఊర మాస్ కథ ఉండాల్సిందే. అయితే ఇప్పటికే తన కథను బాలయ్యకు వినిపించారట వేణు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత నిజముందో త్వరలోనే తెలియనుంది. ఒక వేళ బాలయ్య సినిమా ఓకే అయితే వేణుకు బంపరాఫర్ దక్కినట్లే. ప్రస్తుతం అనిల్ రావిపూడితో కలిసి ఎన్‌బీకే 108 (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు బాలకృష్ణ.




Ye Delhi he mere yaar…?#delhi #geatewayofindia #travel #explorar pic.twitter.com/rYswMtexXC
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




